బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే.. ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు అందుకుంది.  కుంగుబాటుపై చేసిన పోరాటానికి గాను.. దావోస్‌లోని ప్రపంచఆర్థిక వేదిక వార్షికసదస్సులో ఈ అవార్డు  తీసుకున్నారు. పోరాటంతోనే డిప్రెషన్‌పై గెలవడం సాధ్యమని ఆమె తన జీవితంలో సమస్యలను సభికులతో పంచుకున్నారు.

 

కుంగుబాటు, ఆందోళన.. ప్రపంచంలో అత్యధికులను వేధిస్తున్న సమస్యలివి. కొందరు భయపడి ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటూ విజేతలుగా నిలుస్తున్నారు. ఈ  విజేతల్లో ఒకరు బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పటుకొనే. గెలుపు సాధించడమే కాదు.. మానసిక రుగ్మతలపై పోరాటానికి ఏకంగా లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ఫౌండేషన్  ద్వారా  అందిస్తున్న సేవలకు గానూ, ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు వేదికగా  క్రిస్టల్ అవార్డు అందుకుంది.

 

కుంగుబాటు, ఆందోళనలు ఇతర జబ్బుల్లాంటివేనన్న దీపిక.. వాటిని మనమే నయం  చేసుకోవచ్చన్నారు. మానసిక రుగ్మతపై నేను పెంచుకున్న ప్రేమ, ద్వేషమే ..నాకు జీవితం గురించి ఎంతో నేర్పిందన్నారు దీపిక. కుంగుబాటుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే  .. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. డిప్రెషన్‌ అనేది సాధారణమే.. కానీ తీవ్రమైన సమస్య. ఇతర రోగాల మాదిరిగానే ఇది కూడా ఒక జబ్బు మాత్రమే , దాన్ని నయం చేసుకోగలమని మనమంతా అర్థం  చేసుకోవాలన్నారు. కుంగుబాటును నేను కూడా అనుభవించాను. ఆ అనుభవమే ఇప్పుడు మానసిక రుగ్మతలపై పోరాటం చేసేలా ప్రోత్సహించిందని గుర్తు చేసుకున్నారు దీపిక. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికోసం.. Live love Laugh  ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసేలా చేసిందని  దీపిక తెలిపారు.

 

కెరీర్‌ తొలినాళ్లలో తాను డిప్రెషన్‌తో బాధపడ్డానని, అయితే ఇప్పుడు దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని దీపిక, పలు సందర్భాల్లో  తెలిపారు. లివ్ లవ్ లాఫ్ సంస్థ ద్వారా దీపిక...స్కూళ్లలో అవగాహన  కార్యక్రమాలు చేపడుతున్నారు.  ఉచిత సైకియాట్రిక్‌ చికిత్సలు కూడా అందిస్తున్నారు.
బాలీవుడ్లో కింగ్ ఖాన్ షారూక్, మనీషా కొయిరాలా, అనుష్క , ఇల్లిబేబీ సహా పలువురు నటులు, నటీమణులు.. కెరియర్ ఆరంభంలో డిప్రెషన్‌కు గురయ్యారు. తర్వాత ఒత్తిడిని గెల్చి,  విజేతలుగా ఆవిర్భవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: