ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. అయితే శాసన సభలో ఈ రోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మఒడి, రైతుభరోసా వంటి కీలక అంశాలపై సభలో చర్చ జ‌రిగాయి. అలాగే గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే..  దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభించారు. అయితే రైతులపై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుప‌డ‌డంతో అబ్బ‌య్య చౌద‌రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నియోజకవర్గాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. ఇక్కడి ఎమ్మెల్యే వివాదాస్పద వైఖరే ఈ నియోజకవర్గం తరచూ వార్తల్లో ఉంటుంది తప్ప…మరో కారణం లేదు.  అయితే ఇక్క‌డ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన.. రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. మ‌రోవైపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. చింతమనేని ప్ర‌భాక‌ర్ ఎన్నో అరాచ‌కాలు చేస్తుంటే కొమ్ముకాసారే త‌ప్ప ఏ మాత్రం హెచ్చ‌రించ‌లేదు. 

 

దీంతో స‌వాల్ చేసిన అబ్బ‌య్య చౌద‌రి దెందులూరు నుంచి పోటీ చేసి.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంటి బలమైన ప్రత్యర్థితో ఎన్నికల్లో తలపడి ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు అసెంబ‌ల్లీలో అడుగు పెట్టి చంద్ర‌బాబుతో కూడా ఓ ఆట ఆడుకుంటున్నాడు. నేడు అసెంబ్లీ స‌మావేశంలో టీడీపీ రైతుల ద్రోహి అని అబ్బ‌య్య చౌద‌రి విమ‌ర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. 

 

రైతులకు సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారని పేర్కొన్నారు. పామాయిల్‌ రైతులకు రూ.84 కోట్లు ఇచ్చిన ఘనత,  రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఘనత సీఎం జగన్‌దేన‌ని అన్నారు. పార్టీకలతీతంగా నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 96 వేల 662 మంది మత్స్యకారులకు పెన్షన్‌ ఇస్తున్నామని వెల్లడించారు. అస‌లు రైతాంగంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. రైతులను కాల్చిచంపిన బషీర్‌బాగ్‌ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. చంద్రబాబు తీరును శివరామకృష్ణన్‌ కమిటీ కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: