2019 ఎన్నికల తర్వాత టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నా విషయం తెలిసిందే. అమరావతిని శ్వాసగా అనుకున్న చంద్రబాబుకు... జగన్ అధికారంలోకి రాగానే అమరావతి మారుస్తామని షాక్  ఇచ్చారు . ఇక ఆ తర్వాత టిడిపి పార్టీకి చెందిన కీలక నేతలైన ఎంపీలు బిజెపి పార్టీలోకి వెళ్లడం... చంద్రబాబు వెన్నంటే ఉండి వెన్నుముక గా ఉన్న టీడీపీ కీలక నేత వల్లభనేని వంశీ పార్టీని వీడి చంద్రబాబు పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తో మరో షాక్ తగిలింది చంద్రబాబుకి . ఆ తర్వాత దేవినేని అవినాష్ లాంటి నేతలు కూడా పార్టీని వీడడం... అమరావతి మార్పు విషయంలో కొంతమంది టీడీపీ నేతలు సైతం జగన్ సర్కార్ నిర్ణయంకి మద్దతిస్తూ  తీర్మానం చేయడం ప్రతి ఒక్క విషయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి . ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో భారీ షాక్ తగలబోతోంది. 

 


 ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత అధికార వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది . అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానుల  బిల్లును  శాసనమండలిలో ప్రవేశపెట్టగానే టీడీపీ ఎమ్మెల్యేలందరూ బిల్లు ను అడ్డుకోగ...  టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత మాత్రం ఏకంగా టిడిపి విప్ ను సైతం ధిక్కరించి  మరీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. ఈ క్రమంలో టిడిపిలో కీలక నేతగా వ్యవహరించిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ లోకి చేరడం ఖాయమని అర్థమైపోయింది. 

 

 దివంగత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య ఈ  పోతుల సునీత. 2014 ఎన్నికల్లో పోతుల సునీత చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత పోతుల సునీత టిడిపిలో చేరడం తో ఆమెకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. అంతేకాకుండా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన  పోతుల సునీత తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఎంతో మంది కీలక నేతలు ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తున్న నేపథ్యంలో టీడీపీ లోకి కీలక మహిళా నేతగా ఉన్న పోతుల సునీత కూడా పార్టీని వీడబోతుండటం తో  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: