ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల  అంశం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మూడు రాజధానిల అంశంపై విపక్ష పార్టీలన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విపక్ష పార్టీలు అని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. అయితే విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం అసెంబ్లీలో 3 రాజధానిల  బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించింది .  ఈ మూడు రాజధానిల కు సంబంధించిన బిల్లుపై శాసనమండలిలో ఇంకా రసాభాస  కొనసాగుతూనే ఉంది. 

 


 ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ పై ఎన్నోసార్లు ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్. అంతేకాకుండా శాసనమండలిలో కూడా ఈ బిల్లును ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్నారు. ఇక తాజాగా మరోసారి ఎమ్మెల్సీ మాజీ మంత్రి నారా లోకేష్... రాజధాని తరలింపు పై సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. 

 


 మూడు రాజధానుల నిర్మిస్తే  ఎలా ఉంటుంది అనేది ఓ సామాన్య యువకుడు అభిప్రాయాలు వీడియో రూపంలో ట్వీట్ చేశారు నారా లోకేష్. ఈ యువకుడికి ఉన్న తెలివి  అణువంతైనా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంటే... రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు అని నారా లోకేష్  అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా  ప్రస్తుతం టిడిపి నేత నారా లోకేష్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ వీడియోలో  యువకుడు మాట్లాడిన మాటలు కూడా ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మూడు రాజదానుల  నిర్ణయానికి ఏకీభవించడం లేదు అంటూ ఆ యువకుడు మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: