ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర ఓటమి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో లోకేష్ చక్రం తిప్పడంతో పాటు అంతే స్థాయిలో అవినీతికి పాల్పడి, బినామీ పేర్లతో అనేక ఆస్తులు కూడబెట్టాడని, అందుకే ఆయనకు అనుకూలంగా అనేక నిర్ణయాలు ప్రభుత్వంలో జరిగిపోతూ ఉండేవని విమరిస్తున్నారు.


 తన తండ్రి సీఎంగా ఉండడంతో ఆయన అక్కడ ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేదని, తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోరంగా ఓటమి చెందిన తర్వాత లోకేష్ పరిస్థితి సొంత పార్టీలోనే దారుణంగా తయారయింది. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు మొత్తం ప్రధానంగా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వచ్చారు.


 తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఏపీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ బయటపెట్టారు. ఎన్నికలకు ముందు లోకేష్ తనపై పోటీ చేసేందుకు ప్రయత్నించారని, అయితే ముందస్తు జాగ్రత్తగా టిడిపి అధినేత చంద్రబాబు రెండుసార్లు భీమిలిలో లోకేష్ గెలుపు అవకాశాలపై సర్వే చేయించగా లోకేష్ ఓడిపోతాడని రిపోర్ట్ రావడంతో చంద్రబాబు అక్కడి నుంచి పోటీ చేయించేందుకు వెనకడుగు వేసినట్లు మంత్రి చెప్పారు.


 ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అవంతి. చంద్రబాబు ఎపుడూ సింగపూర్, జపాన్ అంటూ ఉంటే, లోకేష్ మాత్రం అమెరికా అంటున్నాడని ఎద్దేవా చేశారు. అయితే తాను మాత్రం శ్రీకాకుళం, విజయనగరం గురించి మాట్లాడుతున్నానని మంత్రి అవంతి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో బి దందాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. విశాఖకు వచ్చిన  రైల్వే జోన్ ను విజయవాడకు తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నించారని, అయితే అప్పట్లో ఎంపీగా ఉన్న తాను దీనిని అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర తీరని అన్యాయం జరిగిందని, ఇక్కడే కాకుండా ఏపీ మొత్తం ఈ విధంగానే జరిగినట్టుగా జనమంతా భావిస్తున్నారని అవంతి విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: