ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలలో దాడి వీరభద్రరావు ఒకరు. అప్పట్లో వైఎస్ పాలనపై దాడి వీరభద్రరావు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలలో వైఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వస్తే దాడి వీరభద్రరావు ముందు వరుసలో ఉండేవారు. కానీ రానురాను రాజకీయాల్లో దాడి వీరభద్రరావు అంత ప్రభావం చూపలేకపోయారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని భావించిన దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 
 
వైఎసీపీలో దాడి వీరభద్రరావు చేరటం అటు టీడీపీ పార్టీ నేతలను, వైసీపీ పార్టీ నేతలను షాక్ కు గురి చేసింది. రాజకీయ విశ్లేషకులు కూడా దాడి వీరభద్రరావు వైసీపీ పార్టీలో చేరటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఆయన తనయుడిని ఎన్నికల్లో పోటీ చేయించినా ఎన్నికల్లో దాడి వీరభద్రరావు తనయుడు విజయం సాధించెలేకపోయాడు. 
 
2014 ఎన్నికల్లో  తన తనయుడి ఓటమి తరువాత పలు సందర్భాల్లో వైసీపీ పార్టీపై దాడి వీరభద్రరావు విమర్శలు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి దాడి వీరభద్రరావు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న దాడి చివరకు మరలా వైసీపీ పార్టీకు దగ్గరై టికెట్ కోసం ప్రయత్నాలు చేయగా జగన్ దాడి వీరభద్రరావును పెద్దగా పట్టించుకోలేదు. 
 
టీడీపీ పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి దాడి వైసీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబుపై తీవ్రంగా దాడి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం ద్వారా జగన్ దృష్టిలో పడాలని ఆయన భావిస్తున్నారు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన దాడి ఇప్పుడు టీడీపీ పార్టీపై విమర్శలు చేయటంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దాడి వీరభద్రరావు ఇప్పుడు రాజకీయాల్లో కమెడియన్ అవుతున్నాడనే విశాఖ జనాలు అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: