జగన్మోహన్ రెడ్డి  సర్కార్ మొదటి నుంచి చెపుతున్న విధంగానే.. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ అవసరమని... పాలనా వికేంద్రీకరణ జరుగుతే  అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలుపుతూ మూడు రాజధానిల ప్రకటన తెరమీదికి తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రకటించిన మూడు రాజధానిల ప్రకటనపై  టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి లో రైతులు నిరసన కు మద్దతు తెలపడం... టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జోలిపట్టి విరాళాలు సేకరించడం.. ఇలా టిడిపి ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ వైసిపి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా... వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించింది . అయితే అసెంబ్లీలో ఆమోదముద్ర వేస్తే నేమీ  మాకు శాసనమండలిలో అసలైన బలం ఉంది అక్కడ ఈ బిల్లుకు ఆమోదం తెలపము అంటూ శపథం  చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. 

 


 ఇక నిన్న శాసనమండలిలో పాలన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు వచ్చింది. అయితే శాసనమండలిలో టిడిపికి ఎక్కువ మెజారిటీ ఉండి  వైసీపీకి మెజార్టీ ఉండడంతో... టిడిపి ఎమ్మెల్సీ లు అందరూ శాసన మండలిలో బిల్లును ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్నారు. రూల్ 71 ప్రకారం చర్చించాలి అంటూ డిమాండ్ చేశారు టిడిపి సభ్యులు. రాజధాని నిర్మాణం పై శాసన మండలిలో  ఎలాంటి చర్చ జరగడం లేదు. దీంతో ప్రజలందరూ టిడిపి శాసన మండలి సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో పైచేయి సాధించాలి అనుకోవడం మంచిదే . కానీ శాసనమండలిలో కీలకమైన రాజధాని బిల్లుపై.. ఇలాంటి చర్చ జరగనీయకుండా టిడిపి పైచేయి సాధించాము  అనుకోవడం మాత్రం తప్పు అని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 రాజదాని  వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును  శాసనమండలిలో ప్రవేశపెట్టి బిల్లుపై చర్చించి ఆ పై వ్యతిరేకిస్తే బాగుండేది అని పలువురి భావన. కానీ టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం బిల్లును ప్రవేశపెట్టకుండా విజయం సాధించామనుకుంటున్నట్లు  తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అటు అసెంబ్లీ లో కూడా  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక చర్చ జరుగుతున్న సమయంలో  టిడిపి సభ్యుడు గోల చేయటం.. శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టనివ్వక  పోవడం... చూస్తుంటే చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ రాంగ్  మెసేజ్ ఇస్తూన్నారు అని  రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: