గత మూడు రోజుల నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల నుండి టీడీపీ వైసీపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్ర స్థాయిలో టిడిపి నేతలు అందరూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రచ్చ చేస్తున్నారు . మూడో రోజు కూడా అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతున్న  టిడిపి నేతలు మాత్రం అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి జై  అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ రోజు అయితే సభలో  ఏకంగా టిడిపి వైసిపి సభ్యుల మధ్య తీవ్ర ఆగ్రహావేశాలు కూడా కొనసాగుతోంది. దీంతో టిడిపి సభ్యుల తీరుతో జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఇక ఈ రోజు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టిడిపి సభ్యులు స్పీకర్  ను  చుట్టుముట్టారూ . అయితే టిడిపి సభ్యుల తీరుపై అధికార పార్టీ సభ్యులందరూ విమర్శలు గుప్పించడం కామనే . కానీ అందరికి షాక్ ఇస్తూ జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ వేదికగా టిడిపిపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును నిరసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే రైతు భరోసా లాంటి  కీలక అంశం పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. టిడిపి సభ్యులు చేస్తున్న అల్లరి దారుణం అంటూ పేర్కొన్నారు. 

 


 టిడిపి సభ్యులు తక్కువ మంది ఉన్నప్పటికీ భారీ గందరగోళం సృష్టిస్తున్నారని... టీడీపీ సభ్యుల హావభావాలు టిడిపి సభ్యులు అందరూ స్పీకర్ దగ్గరికి వెళ్లి చేతులు ఊపుతున్న తీరు చూస్తుంటే స్పీకర్ ను  కొడతారేమో  అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఎంతో  గొప్పదైనా అసెంబ్లీ స్పీకర్ స్థానం పట్ల అమర్యాదకరంగా టిడిపి సభ్యులు వ్యవహరిస్తూ... అసెంబ్లీని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో టిడిపి సభ్యులు జనసేన ఎమ్మెల్యే పై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక టీడీపీ సభ్యుల నినాదాలు విమర్శలతో అసెంబ్లీ మొత్తం గందరగోళం గా మారిపోయింది. ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గతంలో కూడా వైసీపీకి మద్దతు తెలుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: