ఏపీ సీఎం జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసినప్పటి నుండి మూడు రాజధానుల గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఆ తరువాత జగన్ మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీల నివేదికలు రావడం మూడు రాజధానుల నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలపడం అసెంబ్లీలో కూడా మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర పడిందన్న విషయం తెలిసిందే. 
 
కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం వైసీపీకి మండలిలో బిల్లు ఆమోదం పొందకుండా ఆటంకాలు కలుగజేస్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్ తలుచుకుంటే ప్రభుత్వానికి బలం చాలినా చాలకపోయినా ప్రభుత్వానిదే పై చేయి అవుతుంది. మండలిలో వీగిపోయిన బిల్లు అసెంబ్లీకి వస్తే మరలా ప్రభుత్వం బిల్లును ఆమోదించుకుంటుంది. 
 
సీఎం జగన్ మండలిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మందలిని రద్దు చేయాలంటే విధాన సభ ఆమోదం పొంది పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. ఇరు సభలలో ఆమోదం పొందిన తరువాత మండలి రద్దవుతుంది. 1985లో అప్పటి సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు మండలి రద్దు చేసిన విషయo తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో శాసన మండలిని పునరుద్ధరించారు. 
 
జగన్ మండలిని రద్దు చేసే సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మూడు రాజధానుల బిల్లు మాత్రం ఆమోదం పొందడం గ్యారంటీ అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా చివరకు అవి కంటితుడుపు చర్యలే అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు మరో ఓటమి తన ఖాతాలో వేసుకోక తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: