జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పవన్ భేటీ ముగిసింది. పవన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో గంట సేపు చర్చించటం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన చాలా కీలకమైన అంశాల గురించి చర్చింనానని పవన్ కళ్యాణ్ తెలిపారు. చర్చలో రాజధాని అమరావతి గురించి చర్చకు వచ్చిందని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది...? రాష్ట్ర విభజన దగ్గర నుండి ఇప్పటివరకు ఏం జరిగింది...? గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఏ విధంగా సహకారం అందించింది...? ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తుందదో చర్చించామని అన్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పనితీరు మారలేదని చెప్పారు. కేంద్రం నుండి చాలా నిధులు ఇస్తున్నా వినియోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు రాష్ట్రం ఇవ్వటం లేదని అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందో వైసీపీ కూడా అదే విధంగా చేస్తోందని అన్నారు. అమరావతికి సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు, రైతులకు మాట ఇస్తున్నానని రాజధాని గురించి బలమైన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని దానికి బీజేపీ, జనసేన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వైజాగ్ లో రిపబ్లిక్ డే వేడుకలు అని చెప్పి మరలా ఈరోజు వేడుకలు జరిగే స్థలాన్ని మార్చారని అన్నారు. 
 
రాజధానిని తరలించటం అంత తేలిక అనుకుంటున్నారా..? అని పవన్ ప్రశ్నించారు. ప్రతిసారి వైసీపీ నాయకులు పదేపదే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి రాజధానిని మారుస్తున్నామని అంటున్నారని తాను ఢిల్లీ నుండే చెబుతున్నానని రాజధానికి కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదని అన్నారు. కేంద్రంతో మాట్లాడి వైసీపీ రాజధానుల గురించి ఏమీ చేయటం లేదని పవన్ అన్నారు. ఏం చేసినా వైసీపీ కేంద్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారని పవన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: