మూడు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అక్కడ మెజారిటీ ఉండడంతో సులభంగానే ఆమోదముద్ర వేయించింది.  ఆ తరువాత శాసనమండలిలో మాత్రం మూడు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుకు చిక్కులు వచ్చిపడ్డాయి. శాసనమండలిలో మూడు రాజధానుల  బిల్లుకు ఆమోదముద్ర వేయడం ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కార్  కు సవాల్ గా మారిపోయింది. శాసనమండలిలో వైసీపీ సర్కార్ కు తగిన మెజార్టీ లేకపోవడంతో తిప్పలు వచ్చిపడ్డాయి. ఏకంగా మంత్రులే రంగంలోకి దిగినప్పటికీ కూడా... టీడీపీ ఎమ్మెల్సీలు మాత్రం మూడు రాజధానులకు  సంబంధించిన బిల్లుపై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మొదటి రోజు మూడు రాజధానులకు  సంబంధించిన బిల్లును  అసలు శాసనమండలిలో పెట్టకుండా అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. 

 

 

 ఇక చరిత్రలోనే తొలిసారిగా మంత్రులు సైతం శాసనమండలి చైర్మన్ వద్దకు వెళ్లి పోడియం దగ్గర నినాదాలు చేసి ఎట్టకేలకు బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఇక ఈ రోజు ప్రారంభమైన శాసనమండలి ఉదయం నుంచి రసాభాసగా మారిపోయింది. ఎట్టకేలకు సిఆర్డిఏ రద్దు సహా పాలన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుపై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య చర్చ జరిగింది. ఎన్నో వాదోపవాదాలు.. మరెన్నో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య తాజాగా ఈ రెండు బిల్లులపై చర్చ ముగిసింది. నేడు శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. 

 

 

 టిడిపి సభ్యుడు యనమల  రామకృష్ణ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరారు. కానీ అధికారపక్షం మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదంటూ వాదిస్తోంది. కాగా ఈ సందర్భంగా అధికార విపక్ష పార్టీల సభ్యులు నినాదాలతో శాసన మండలి మొత్తం రసాభాసగా మారింది. శాసనమండలిలో టిడిపి సభ్యుల తీరుకు ఆగ్రహించిన మంత్రి కొడాలి నాని టీడీపీ  ఎమ్మెల్సీల వైపు దూసుకు పోయారు. టిడిపి ఎమ్మెల్సీలు కూడా  కొడాలి నాని వైపు ధూసుకొచ్చారు. నారా లోకేష్ కొడాలి నాని ఏకంగా చైర్మన్ పోడియం  ముందే వాగ్వాదానికి దిగారు. కాగా శాసనమండలి చైర్మన్ నిర్ణయం  పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలంలో రసాభాస నెలకొనడంతో మరోసారి మండలి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: