ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్ జగన్ వికేంద్రీకరణ బిల్లును ఎటువంటి అభ్యంతరాలు లేకుండానే పాస్ చేయగలిగిన కానీ శాసనమండలిలో మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో రూల్ 71 తెరపైకి తీసుకు రావడంతో వికేంద్రీకరణ బిల్లు చర్చకు కూడా రాలేకపోయినట్లు సమాచారం. శాసనమండలి సమావేశాలను అడ్డుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు అసెంబ్లీ శాసనమండలిలో చేశారు. మంగళవారం జరిగిన సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం జరిగిన శాసనమండలిలో అదేస్థాయిలో వ్యవహరించటం తో శాసనమండలి చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ సభ్యుల పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

 

ముఖ్యంగా టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. ఈ సందర్భంగా సాంకేతిక సమస్య వల్ల టీవీ ప్రసారాలు రావడంలేదని మంత్రి వివరణ ఇచ్చినా గానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు రౌడీల మాదిరిగా మంత్రి పై విరుచుకు పడటంతో శాసన మండలి సభ యుద్ధ వాతావరణం తలపించింది.  దీంతో శాసన మండలి లో జరిగిన వాతావరణం ఎవరు ఏ విధంగా వ్యవహరించారు అన్న విషయాలను అధినేత చంద్రబాబు కి చాలా గొప్పగా రౌడీలు మాదిరిగా బెజవాడ రౌడీలు మాదిరిగా వ్యవహరించినట్లు చెప్పుకొన్నారు.

 

దీంతో ఈ వీడియో బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు పై సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలా వ్యవహరించే బట్టే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమయ్యారని భవిష్యత్తులో మరింత దారుణంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కిందకి పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో సమావేశాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగకుండా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: