జనాలు బాగా ఫోకస్ అవ్వాలని అందరూ తమ గొప్పతనాన్ని చూసి మురిసిపోవాలని కొంతమంది వింత వింత గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక కొంతమంది రాజకీయ నాయకులు అయితే మీడియాలో కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. టీవీలోనూ, పేపర్లలోనూ, ఫోటోలను, వీడియోలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఎంత ఎక్కువగా మీడియాలో కనిపిస్తే అంత గొప్ప నాయకులు అయిపోతాము అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. 


పబ్లిసిటీ పిచ్చి ఉండవచ్చుగాని అది కొంతవరకు లిమిట్స్ లో ఉంటే జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదు. అలా కాకుండా అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నామా అనేది పట్టించుకోకుండా... మీడియా కోసం పబ్లిసిటీ స్టంట్ కోసం రాజకీయాలు నడిపిస్తే జనాల్లో పలుచనవ్వడం మాత్రం పక్కా .


 ఇప్పుడు అదే రకమైన పబ్లిసిటీ పిచ్చి తో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లైవ్ లో కనిపించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ... ఏదో ఒక ఒక సమస్యను తెర మీదకు తీసుకు వస్తూ... మీడియాను పిలిచి హడావుడి చేస్తూ లైవ్ ప్రోగ్రాం లో కనిపించే విధంగా ఆరాటపడుతున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం 25 రోజులుగా అమరావతిలో జరుగుతున్న పరిణామాలు చూసిన వారికి ఎవరికైనా మీడియా కోసం టీడీపీ చేసే రాజకీయ విన్యాసాలు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి.


రాజధాని వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో కొద్దో గొప్పో వ్యతిరేకత ఉన్నా, మెజార్టీ ప్రజలు మాత్రం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. అయితే టిడిపి అనుకూల మీడియా ద్వారా కొంతమంది వ్యక్తులను రంగంలోకి దింపి లైవ్ లో ప్రభుత్వాన్ని తిట్టిస్థూ ఆనందాన్ని పొందుతోంది టిడిపి. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నా, ఆ మీడియా ఛానల్స్ యాజమాన్యంలో కానీ, టిడిపి నాయకుల్లో కానీ ఏ మార్పు కనిపించడం లేదు.


 గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తిత్లి తుఫాను కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఆ సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన సౌకర్యాల గురించి పట్టించుకోకుండా, తిత్లి తుఫాన్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి బస్సులపై బాగా ప్రచారం చేసుకున్నారు. ఆఖరికి తిత్లి తుఫాన్ బాధితులకు వడ్డించిన అప్పడాల పైన కూడా చంద్రబాబు ఫోటోలు ముద్రించుకుని తమ పబ్లిసిటీ పిచ్చి నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ఆ పార్టీ నాయకులు గానీ అధినేత చంద్రబాబులో కానీ  ఏ రకమైన మార్పు కనిపించడం లేదు. లైవ్ ప్రోగ్రాం కోసం అవసరమైతే ఒక సమస్యను సృష్టించి దానిపై రాద్ధాంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వెనుకాడకపోవడం పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: