వైసీపీ వ్యతిరేక ప్రచారం.. చంద్రబాబు అనుకూల ప్రచారం.. ఇదే కదా.. ఎల్లో మీడియా చేసే పని. ఈ విషయం పై అందరికీ క్లారిటీ ఉంది. ఆ ఎల్లో మీడియా పనులు రోజూ చూస్తేనే ఉన్నారు ప్రజలంతా. కానీ తాజాగా ఎల్లో మీడియాగా పేరుబడిన ఈ మీడియా ఇప్పుడు బ్లూ మీడియాగా కూడా మారుతోంది. అవును మరి. ఎందుకంటే.. ఓ లేడీ కానిస్టేబుల్ బట్టలు మార్చుకుంటుంటే కూడా దాన్ని చిత్రీకరిస్తుంటే అది బ్లూ మీడియా కాకుండా ఏమవుతుంది మరి.

 

అసలేం జరిగిదంటే.. ఏపీ రాజధాని తరలింపుపై ఇప్పటికే దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా సంస్థలు మరో సిగ్గుమాలిన చర్యలకు ఒడిగట్టాయి. మందడం హైస్కూల్‌లో మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా కనీస మర్యాద పాటించడకుండా వీడియో ద్వారా చిత్రీకరించాయి. అసెంబ్లీ సమావేశాల కోసం పోలీసులకు డ్యూటీలు వేశారు. వారికి బస కోసం స్థానిక పాఠశాలను కేటాయించారు. విధుల నిమిత్తం మందడంకు వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్‌ డ్యూటీ అనంతరం హైస్కూల్‌లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటున్నారు.

 

అయితే మందడం హైస్కూలును పోలీసులు ఆక్రమించారంటూ దుష్ప్రచారం ప్రారంభించిన ఎల్లో ఛానల్లు.. గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారు. ఓ లేడీ కానిస్టేబుల్ బట్టలు మార్చుకుంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా షూటింగ్ కంటిన్యూ చేశారు. ఈ ఛానళ్ల తీరుపై సదరు కానిస్టేబుల్ మండిపడ్డారు.

 

పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. పాఠశాల హెడ్‌ మాస్టార్‌ కోటేశ్వరరావు కూడా మీడియాపై మండిపడ్డారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్‌కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: