ఏంటి అని షాక్ అవుతున్నారా? అవ్వండి.. ఆ టైటిల్ చూస్తే ఎవరైనా అవ్వాల్సిందే మరి. ఇంకా అసలు విషయానికి వస్తే.. టికెట్ లేని ప్రయాణం ఎక్కడైనా నేరమే.. ఎక్కడైనా.. ఎవరైనా ప్రయాణం చేసే సమయంలో టికెట్ తీసుకోకుంటే ఎంత ఫైన్ వేస్తారు? టికెట్ ఖరీదు వేస్తారు.. లేదా దానికి రెండింతలు ఎక్కువ వేస్తారు.. లేదు అంటే మహా అయితే మూడింతలు వేస్తారు.    

 

కానీ ఇక్కడ మాత్రం ఏకంగా వంద కోట్లు జరిమానా వేశారు. అయితే ఒకరికి కాదు లెండి.. ఒక సంవత్సరం సమయంలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేసినందుకు పడిన జరిమానా ఇది. ఏకంగా 2019 సంవత్సరంలో టికెట్ లేకుండా ప్రయాణం చేసినందుకు గాను ముంబయి పశ్చిమ రైల్వే విభాగానికి రూ.100కోట్లు ఆదాయం వచ్చింది.              

 

ఇది నిజంగా బాగుంది కదా.. వాళ్ళు అంత కరెక్ట్ గా ప్రయాణం అంటే.. టికెట్ తీసుకోని ప్రయాణం చెసింటే అందులో నాలుగోవ వంతు ఆదాయం కూడా రాదు.. అంటే 25 లక్షలు కూడా రావు.. కానీ.. ఏదో డబ్బు అధ చేసుకోవాలి అనే దూరఆలోచనతో.. నిర్లక్ష్యం కారణంగా వారి ఒకేసారి మూడింతల జరిమానా పడింది. 

 

వారి నిర్లక్ష్యమే వీరి ఆదాయం.. అన్నట్టు అయ్యింది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 ఏప్రిల్‌ నుండి డిసెంబరు మధ్య పశ్చిమ రైల్వే విభాగంలో టికెట్టు లేకుండా ప్రయాణించిన వారు జరిమానాల రూపంలో రూ.104.10కోట్లు చెల్లించారు. వీటిలో లగేజీకి సంబంధించిన జరిమానాలు కూడా భారీగానే ఉన్నాయి. కేవలం 9 నెలల్లో 104 కోట్ల రూపాయిల ఆదాయం జరిమానాలు రూపంలో వారికీ వచ్చింది అంటే.. ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా.. కాస్త కూడా భయం లేకుండా ఉన్నారో అర్థం చేసుకోవాలి.          

మరింత సమాచారం తెలుసుకోండి: