ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని వ్యతిరేకించి....తమ రియల్ ఎస్టేట్ కోసం అమరావతిలోనే మొత్తం రాజధాని ఉంచాలని డిమాండ్ చేస్తున్న టీడీపీకి....అమరావతికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంత మైలేజ్ వచ్చింది? అని ప్రశ్న ఉత్పన్నమైతే...అసలు మైలేజ్ కాదు కదా...ఉన్నదే పోయిందని రాజకీయ వర్గాలు చర్చికుంటున్నాయి. జగన్ ప్రజల మేలు కోసం ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ...రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న టీడీపీ మూడు రాజధానులని గుడ్డిగా అపోజ్ చేస్తూ...తమ సొంత లబ్ది కోసం అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఎలాగైనా మూడు రాజధానులని అడ్డుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు. జోలె పట్టుకుని మరి రోడ్ల మీదకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చేలా మాట్లాడుతూ....ముందుకెళుతున్నారు. అయితే ఈయన చేస్తున్న రాజకీయాన్ని అర్ధం చేసుకున్న ప్రజలు జగన్‌కే మద్ధతు తెలుపుతున్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్‌పై ఏమన్నా వ్యతిరేకిత వచ్చి....చంద్రబాబుకు అనుకూలంగా మారిందా? అంటే అసలు లేదు. ఇక్కడ ప్రజలు కూడా మూడు రాజధానులని స్వాగతిస్తున్నారు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండనుండటం, అమరావతిలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు తెల్సుకున్న ప్రజలు జగన్‌కే జై కొడుతున్నారు.

 

ఫలితంగా టీడీపీకి మైలేజ్ రాకపోగా, ఉన్న బలం తగ్గుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో కృష్ణాలో ఉన్న 16 సీట్లలో రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ, గుంటూరు జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాలని టీడీపీ గెలుచుకుంది. అయితే రాను రాను టీడీపీ పరిస్థితి దారుణమైపోయింది. కృష్ణాలో వంశీ, గుంటూరులో మద్దాలి గిరిలు జగన్‌కు జై కొట్టారు. ఇక ఎమ్మెల్యేలే కాదు ప్రజలు కూడా టీడీపీకు దూరమవుతున్నారు. ఏదో రాజధాని ప్రాంతంలో నాలుగైదు గ్రామాల్లో తప్ప రెండు జిల్లాలోనూ టీడీపీకి అనుకున్న మైలేజ్ రాకపోగా, ఉన్నది పోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: