పేరు గొప్ప ఊరు దిబ్బ...ఇదే ఇప్పుడు టీడీపీ పరిస్తితి.  దాదాపు 38 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. జాతీయ పార్టీగా పైకి పేరు ఉన్న కనీసం ఉప ప్రాంతీయ పార్టీగా కూడా అర్హత లేని విధంగా అయిపోయింది. ఏపీ ఉమ్మడిగా ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తిరుగులేని పార్టీగానే ఉంది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం పీక్‌కు చేరుకుందో...అప్పటి నుంచి టీడీపీ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది. దీనికి తోడు చంద్రబాబు పనికిమాలిన రాజకీయాలు వల్ల పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లింది.

 

తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం పెట్టుకోవడంలో వల్ల పార్టీకి నష్టం జరగడం మొదలైంది. చివరికి తెలంగాణకు అనుకూలంగా మారిన కూడా పార్టీ నిలవలేదు. ఇక రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో డ్యామేజ్ మొదలైంది. ఓ వైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన...తెలంగాణలో పార్టీకి దెబ్బ దెబ్బ మీద తగలడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా చంద్రబాబు స్వార్ధం వల్ల ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడంతో టీడీపీ అడ్రెస్ గల్లంతైంది. ఇక అక్కడ నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూసుకుంటే తెలంగాణలో టీడీపీ పూర్తిగా తెరమరుగైపోయింది.

 

సరే తెలంగాణలో పోయింది...ఏపీలో బాగుందనుకునే లోపే, 2019 లో అధికారం కోల్పోవడం.. కేవలం 23 సీట్లకు పరిమితం కావడం. బాబు మీద నమ్మకం పోయి వరుసగా నేతలు వలస వెళ్లిపోవడంతో టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఇక ఈలోపే జగన్ తన వ్యూహాలతో బాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక దీన్ని వ్యతిరేకించి కేవలం అమరావతి కావాలంటూ బాబు వాదన చేయడంతో, టీడీపీకి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఊహించని డ్యామేజ్ జరగడం ఖాయమైంది. అసలకు చూసుకుంటే టీడీపీ కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమవుదనిపిస్తుంది. ఇక దీని బట్టి చూస్తే జాతీయ పార్టీగా పేరు ఉన్న టీడీపీ కేవలం ఉప ప్రాంతీయ పార్టీ అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: