ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు అంశం అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ శాసన మండలి లో ఆ బిల్లును అడ్డుకోవడం జరిగింది. 71 రూల్ తెరపైకి తీసుకువచ్చి శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు అడ్డుకోవడంతో సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ సంబరాలు మూన్నాళ్ళ ముచ్చటే ఉన్న పరువు కూడా గోవిందా అన్నట్టుగా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎదురు కాబోతున్నట్లు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. మండలిలో రద్దయిన బిల్లు రెండుసార్లు చర్చకు సాగకపోతే తిరస్కరించినట్టు గా భావించి అసెంబ్లీలో మరోసారి ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీ పరువు గోవిందా అన్న పరిస్థితుల్లో తయారవుతుందని వార్తలు వినపడుతున్నాయి.

 

వికేంద్రీకరణ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని విభజనతో హైదరాబాద్ నగరం పోగొట్టుకొని చాలా వరకు ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ పరిపాలన జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని రాష్ట్రం మరొకసారి విడిపోకుండా ఉంటుందని వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలంగా నమ్మడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఎప్పటినుండో వెనుకబడిపోయిన ప్రాంతాలుగా పేరు తెచ్చుకున్న రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందటం గ్యారెంటీ అని అమరావతిలో రాజధాని కొనసాగిస్తూ పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని అదేవిధంగా జుడిషియల్ రాజధానిగా కర్నూలు ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది.

 

అయితే చంద్రబాబు మాత్రం పరిపాలన అంతా ఒకచోట మాత్రమే జరగాలని మూడు రాజధానులు కలిగిన ఏ దేశం కూడా ప్రపంచం లో ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదని వాదిస్తూ అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని జగన్ తెరపైకి తెచ్చిన వికేంద్రీకరణ అంశాన్ని తీవ్రంగా విభేదించడం జరిగింది. అయితే బిల్లు అసెంబ్లీలో పాస్ అయినా గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవటంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ కావాలని మా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా చూస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: