ఊహించని మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్‌కు కూడా ఓ వీక్‌నెస్ ఉంది. తన తండ్రి దివంగత వైఎస్సార్ మాదిరిగానే జగన్ కూడా జనానికి ఎప్పుడు ఏదొకటి చేయాలనే తపన బాగా ఉంటుంది. అందుకనే అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకమునుపే వైఎస్సార్ కూడా అమలు చేయలేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. అయితే పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా..అధికారం కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్తితి ఉన్న చంద్రబాబు...జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం, పథకంపై విమర్శలు చేయడం చేశారు. కనీసం కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా రోడ్లు మీదకొచ్చి రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

 

కానీ చంద్రబాబు ఎంత రాజకీయం చేస్తే అంతగా జగన్ ప్రజలకు మేలు చేసే పథకాలు అందించడం మొదలుపెట్టారు. ఓ వైపు కుళ్ళు, కుతంత్రాలు జరుగుతున్న కూడా...ఓ వైపు వాటిని ధీటుగా ఎదురుకుంటూనే...ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులని తీసుకొస్తే...దానిపై కూడా రాజకీయ నిరుద్యోగిగా ఉన్న చంద్రబాబు రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని చెబుతూ రోడ్ల మీదకొచ్చి ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

 

కానీ బాబు మాటలని పట్టించుకొని ప్రజలు జగన్‌కే మద్ధతు తెలుపుతున్నారు. అయితే రాష్ట్రమంతా మూడు రాజధానులపై రాజకీయం జరుగుతున్న కూడా జగన్ ప్రజలని వదిలేయలేదు. బాబు అండ్ కొ చేస్తున్న కుట్రలని తిప్పికొడుతూ....ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే అమ్మఒడి పేరిట పేద తల్లులని ఆదుకున్న జగన్...తాజాగా విద్యార్ధుల కోసం గొప్ప పథకాలు తీసుకొచ్చారు.

 

అలాగే రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని భావించే జగన్....రైతుల కోసం పలు కార్యక్రమాలని చేపట్టారు. ఇప్పటికే వారికి రైతు భరోసా పేరిట రూ. 13,500 ఆర్ధిక సాయం చేశారు. ఇక ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. వీటి ద్వారానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇవ్వనున్నారు. అలాగే పశువులకు హెల్త్ కార్డు, పంట బీమా కార్డులు ఇవ్వనున్నారు. ఇక వీటి బట్టి చూసుకుంటే ప్రతిపక్షాలు ఎంత రాజకీయం చేసినా...జగన్ జనాలని వదలడం లేదని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: