కొన్ని జీవితాలు అంతే.. ఎంత మంచి పేరు ఉన్న సరే.. ఎంత సంపాదించినా సరే.. ఎంత రేంజ్ ఉన్న సరే.. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. అన్ని ఉంటాయి కానీ చావు మాత్రం సహజంగా రాదు. ఎందుకు అనేది దేవుడికే తెలియాలి. అయితే ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సైకిల్స్ తయారీ సంస్థ 'అట్లాస్' యజమాని సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) ఆత్మహత్యకు పాల్పడ్డారు.               

 

ఢిల్లీలోని ఔరంగజేబు లైన్ లో వీరు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ఆమె నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న కూడా పోలీసులకు ఈ సమాచారం మాత్రం ఈరోజు తెలిసింది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని నటాష్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.       

 

ఘటనా స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ రాసింది. నటాష్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేరని, కూతురు, కొడుకు మాత్రం ఇంట్లోనే ఉన్నట్టు ఆ కథనంలో ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.             

 

ఆమె మృతదేహానికి గంగారామ్ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం, నటాష్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు చెప్పారు. కాగా లోధీ రోడ్ లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా 57 ఏళ్ళ వృద్ధురాలైన ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎం ఉంది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది మాత్రం మిస్టరీగానే మారింది. దీంతో ప్రస్తుతం ఆమె ఆత్మహత్యపై సోషల్ మీడియాలో విభిన్న కోణాల్లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: