ఏపీ సీఎం జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసి ఆ ప్రకటన ప్రకారమే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించేలా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ బిల్లు మండలిలో పాస్ కాకుండా వ్యూహాలు రచిస్తున్నారు. కానీ బాబు వేసిన ప్లాన్ రివర్స్ అవుతూ ఉండటం గమనార్హం. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత పదవికి రాజీనామా విషయం తెలిసిందే. 
 
మరోవైపు తాజాగా ఎమ్మెల్సీ శమంతకమణి తన పదవికి రాజీనామా చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇంకా టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల గురించి మండలిలో చర్చ జరుగుతోంది.  రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని యనమల కోరారు. యనమల సెలక్ట్ కమిటీకి పంపే అంశంపై ఓటింగ్ జరపాలని కోరారు. 
 
బుగ్గన సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఓటు హక్కు లేని వారిని బయటకు పంపాలని ఛైర్మన్ ను కోరారు. 20 మంది మంత్రులు ఛైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లారు. టీడీపీఎమ్మెల్సీలు పోడియం దగ్గర ఉన్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత ఛైర్మన్ శాసన మండలిని కొంత సమయం వాయిదా వేశారు. 
 
ఈరోజు ఏపీ శాసన మండలి గ్యాలరీలోకి చంద్రబాబు వెళ్లారు. మూడు రాజధానుల బిల్లుపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు వెళ్లారు. వైసీపీ పార్టీ ఈ బిల్లును ఎలాగైనా ఈ బిల్లును ఆమోదింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్సీలు మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న చర్చను అసెంబ్లీ నుండి చంద్రబాబు తన ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారాలలో చూస్తుండగా ప్రసారాలను నిలిపివేయడంతో మండలిలోకి వెళ్లి ప్రసారాలను త్వరగా పునరిద్ధరించాలని చంద్రబాబు కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: