ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు రూల్ 71 తెరపైకి తెచ్చి అడ్డుకోవటంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వెనుకబాటుతనాన్ని దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని కేవలం చంద్రబాబు వర్గం ఉండే ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందాలన ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపై ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను వ్యవహరించే విషయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కీలక సమయంలో ఆయన శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల విషయంలో ఆయన తిప్పిన చక్రం అధినేత వైయస్ జగన్ మనసును గెలుచుకున్నట్లు వైసీపీ పార్టీలో వినికిడి. మేటర్ లోకి వెళితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత మరియు శివనాథ రెడ్డి పార్టీ నిర్ణయానికి అనగా అమరావతి లోని రాజధాని ఉంచాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వ్యవహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

పోతుల సునీతది ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గమే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో నవోదయం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత ఆమెను టీడీపీ అగ్ర నాయకత్వం మండలి కి పంపించింది. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఒకే జిల్లా కావడం వల్ల ఆమంచితో సత్సంబంధాలే ఉన్నాయని దీంతో ఆమెను తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయించే విషయంలో ఆమంచి కీలకంగా వ్యవహరించారని ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి రాయలసీమకు చెందిన నాయకుడు విషయంలో కూడా ఆమంచి కీలకంగా వ్యవహరించారని వార్తలు గట్టిగా రావడంతో 2019 ఎన్నికల్లో ఓడిపోయినా గాని రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని ఆమంచి పడుతున్న తపనను వైయస్ జగన్ ని ఎంతగానో ప్రభావితం చేసినట్లు వైసీపీ పార్టీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ముందు నుండి వికేంద్రీకరణ జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని వాదన వినిపించిన ఆమంచి కృష్ణమోహన్ తాను అధికారంలో లేకపోయినా కానీ వికేంద్రీకరణ బిల్లు పాస్ విషయంలో బయట ఉండి చక్రం తిప్పిన తీరు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆశ్చర్యపరిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: