నెటిజన్ల అందరికీ అది ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్... ఒక్కసారి ఓపెన్ చేశారో మళ్లీ క్లోస్ చేయడం చాలా కష్టం... మాయదారి పబ్ జీ ని సైతం మరిపించిన యాప్ ఇది ... ప్రస్తుతం అందరిని  ఒక రేంజ్ లో ఊపేస్తున్నది... ఇంతకీ నేను దేని గురించి చెబుతున్నాను అనుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఒక రేంజ్ లో ఊపేసి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయిపోయిన యాప్ టిక్ టాక్ గురుంచి . మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో ప్రభావితం చేసింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు అందరూ టిక్ టాక్ యాప్ ని వాడుతున్నారు. టిక్ టాక్ లో ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారూ. ఆన్లైన్ యాప్స్ అన్నింటిలో మొదటి ప్లేస్ లో ఉండే ఫేస్బుక్ వాట్సప్ లను  సైతం వెనక్కి నెట్టి టిక్ టాక్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. 

 

 

 ఇక చిన్న  పెద్ద తేడా లేకుండా అందరూ టిక్ టాక్ లో వీడియోలు చేయడానికి...ఇతరులు  చేసిన వీడియోలు చూడడానికి ఎంతో  ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ టిక్టాక్ బానిసగా  ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. టిక్ టాక్ లో లైకులు రావాలనే కుతూహలంతో ఎన్నో ప్రమాదకరమైన స్టెంట్స్  చేసి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.. టిక్ టాక్  ద్వారా తెగ ఫేమస్ అయిపోయి సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని  సెలబ్రిటీలు అయిపోయిన వారు ఉన్నారు. టిక్ టాక్ ఎంత మంచి చేస్తుందో అంతే  చెడు చేస్తుంది. ప్రస్తుతం టిక్ టాక్ లో ఎన్నో వీడియోలు చేసి  సెలబ్రెటీలు అయిపోయిన వారు ఎంతోమంది. సినీ సెలబ్రిటీల రేంజ్ లో టిక్ టాక్ లో ఫాన్స్ ను  సంపాదించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. 

 

 

 అయితే టిక్టాక్ లో ఇప్పటికే ఎన్నో ఛాలెంజ్ లు  వచ్చి అందరిని ఆకర్షించిన  విషయం తెలిసిందే. టిక్ టాక్ లో ఇటీవలే ఛాలెంజ్  వీడియోలు ట్రెండింగ్ ఎక్కువైపోయింది. తాజాగా మరో ఛాలెంజ్ టిక్ టాక్ లో హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఛాలెంజ్ మాత్రం ప్రమాదకరంగా మారింది. అదేంటంటే ఓ  మొబైల్ చార్జర్ అడాప్టర్ ఎలక్ట్రానిక్ సాకెట్ కి  అమర్చాలి... చార్జర్ అడాప్టర్ మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ లో ఓ నాణేన్ని  వేయాలి.  ఆ నాణెం  కింద పడిపోకుండా అక్కడే ఆగేలా  చేయడమే ఈ చాలెంజ్. అయితే ఈ చాలెంజ్ ప్రయత్నిస్తుంటే కరెంట్ షాక్ కొడుతుందని ఇటీవలే ప్రయత్నించిన కొంతమంది తెలిపారు. అందుకే ఇలాంటి చాలెంజ్ దూరంగా ఉండండి .

మరింత సమాచారం తెలుసుకోండి: