కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  దేశంలో అనేక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.  మహారాష్ట్ర, గుజరాత్ కు సమీపంలో అరేబియా సముద్రంలో ఉన్న డయ్యు, డామన్... దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఒకటిగా చేసింది.  ఈ రెండింటిని ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి రెండింటికి కలిపి ఒకటే రాజధానిగా డయ్యును ఉంచింది.  దీనికి సంబందించిన బిల్లును గత డిసెంబర్ 3 వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఆమోదం పొందింది.  


జనవరి 26 వ తేదీ నుంచి అధికారికంగా అమలులోకి వస్తున్నది.  రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకటిగా కలపడం వలన పరిపాలన పరంగా,   స్ట్రాంగ్ అవుతుందని, ఒకటే రాజధానిగా ఉంచడం వలన పరిపాలన సౌలభ్యంతో పాటుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉండొచ్చని అంటున్నారు . రెండింటిని విలీనం చేయడం వల్ల పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని, ఇరు ప్రాంతాల అభివృద్ధి పుంజుకుంటుందని తెలిపారు. పరిపాలన సంబంధమైన ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. 


రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేశారు.  జనవరి 26 నుంచి అధికారికంగా రెండు ప్రాంతాలు ఒక్కటి కాబోతున్నాయి.  ఇది శుభపరిణామం అని చెప్పాలి.  ఇదిలా ఉంటె, అటు కేంద్రం ఢిల్లీ విషయంలో కూడా సంచలనం నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.  ఢిల్లీ రాజధానిని ఆధునీకరించేందుకు సిద్ధం అయ్యింది.  దానికి తగ్గట్టుగానే నిర్ణయాలుతీసుకుంటోంది . 


ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన సమయంలో కేంద్రం తీసుకున్న ఒకే రాజధాని నిర్ణయం, అటు ఢిల్లీని ఆధునీకరిస్తూ...పరిపాలన భవనాలను ఒకేచోట నిర్మిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.  ఎలాగైనా సరే ముడు రాజధానులను అడ్డుకోవాలని చూస్తున్నాయి.  మరి చూద్దాం ఏమవుతుందో.  ఈరోజు కూడాఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీవరమైన చర్చలు దీనిపై జరుగుతున్నాయి.  తెలుగుదేశం, వైకాపా నేతలు సభలో కొట్టుకునేంత పనులు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: