వివాదాస్పద మధురై ఆధీనం మఠాధిపతి నిత్యానందపై ఇంటర్ పోల్ నోటీసులు జారీ అయ్యాయి. నిత్యానంద ఎక్కడ కనిపించినా.. వెంటనే సమాచారం ఇవ్వాలని ఇంటర్ పోల్ సభ్యదేశాల్ని కోరింది. మైనర్లపై అత్యాచారం, అపహరణ కేసుల్లో గుజరాత్ పోలీసులు నిత్యానంద కోసం వెతుకుతున్నారు. దేశం దాటాడని తెలియడంతో.. ఇంటర్ పోల్ ను సంప్రదించారు. 

 

స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందపై ఇంటర్ పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. నిత్యానంద ఎక్కడ కనిపించినా.. అతడికి సంబంధించిన వివరాలు సభ్యదేశాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే నిత్యానంద తమ దగ్గర ఆశ్రయం పొందుతున్నాడన్న వాదనను ఈక్వెడార్ ఖండించింది. తమ దేశ భూభూగాన్ని కూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేసింది. తమ దగ్గర ఆశ్రయం కోరిన మాట నిజమే కానీ.. తాము నిత్యానందకు అభయం ఇవ్వలేదని తేల్చేసింది ఈక్వెడార్. అంతటితో ఆగకుండా అతడు హైతీ పారిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇంటర్ పోల్ ను సంప్రదించారు. 

 

మైనర్లపై అత్యాచారం, అపహరణ కేసుల్లో గుజరాత్ పోలీసులు నిత్యానంద కోసం వెతుకుతున్నారు. అహ్మదాబాద్ ఆశ్రమంలో మైనర్లను నిర్భంధించాడనే ఆరోపణలు కూడా నిత్యానందపై ఉన్నాయి. గత ఏడాదే దేశం దాటిన నిత్యానంద కైలాస పేరుతో కొత్త దేశాన్నే ప్రకటించాడు. తాను పరమశివుడ్నని, ఏ కోర్టులూ విచారించలేవని గతంలో నోరు జారాడు నిత్యానంద. ఇంతటితో ఆగలేదు నిత్యానంద. కైలాస దేశంలో నివసించేవారెవరికీ చావు ఉండదని, ప్రపంచంలో ఇదే అతి పెద్ద హిందూ దేశమని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కైలాస దేశం ఫేకని , నిత్యానంద వెబ్ సైట్లో దాన్ని సృష్టించారని ఈక్వెడార్ చెప్పడంతో.. నిత్యానంద ఆచూకీ మాత్రం ఎవరికీ దొరకలేదు. నిత్యానందపై భారత్ లో పలు కేసులున్నాయి. గతంలో సెక్స్ టేపుల వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డ నిత్యానంద.. తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. మొత్తానికి నిత్యానంద కోసం వేట మాత్రం కొనసాగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: