ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ఏదో ఒకటి అతనికి నచ్చింది ట్విట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మరో సంచలన ట్విట్ చేశారు.. మరి కొందరి మనసులు దోచుకున్నారు.. ఆనంద్ మహింద్ర. అసలు అంతగా ట్విట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. మనం చిన్నప్పుడు అందరం ఎంతో కస్టపడి నేర్చుకునే ఎక్కం గురించి అయన పెట్టారు . 

 

వాట్సాప్‌ వండర్‌ బాక్స్‌.. ఆనంద్ మహీంద్రా..  వాట్సాప్ లో ఏవి అయితే ట్రెండ్ అవుతాయో అవి తీసుకొచ్చి ట్విట్టర్ లో వేసి వాట్సాప్ వండర్ బాక్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఓ వీడియో పోస్ట్ చేసారు. అది ఏంటి అంటే.. మనం చిన్నప్పుడు చదివే సమయంలో మ్యాథ్స్ చాల ఇంపార్టెంట్. 

 

ఆ మాథ్స్ లో ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి ఎక్కాలు.. ఎంత బుర్రను బాదుకున్న ఆ ఎక్కాలు అనేవి రావు. అయితే ఎలాంటి విద్యార్థికి అయినా 5వ ఎక్కం.. 10వ ఎక్కం బాగా వస్తాయి. కానీ మిగితావి ఏవి రావు.. అవి రవళి అంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. అయితే ఇప్పుడు ఆ కష్టాలు ఏమి లేకుండా ఎక్కాలు పిల్లలకు యిట్టె గుర్తు ఉండిపోయేలా ఓ మాథ్స్‌ టీచర్ ఇచ్చిన కొన్ని చిట్కాలను పిల్లల మనసులో గుర్తిండి పోయేలా ఉన్నాయి. 

 

తొమ్మిదో ఎక్కాన్ని అతి సులువుగా విద్యార్థులకు నేర్పిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చుసిన ఆనంద్ మహీంద్రా హాస్యాస్పదంగా స్పందించి అందరిని ఆకట్టుకున్నాడు. ఎం అని ట్విట్ చేశాడు అంటే.. ''ఈ తెలివైన, సులువైన షార్ట్‌కట్‌ గురించి తెలియదు. ఆమె నా గణిత ఉపాధ్యాయురాలిగా ఉండివుంటే.. గణితంలో బహుశా ఇంకా చాలా మెరుగ్గా వుండేవాడినంటూ  వ్యాఖ్యానించారు.'' ఈ ట్విట్ కి బాలీవుడ్‌ బాద్‌షా షారూక్ ఖాన్‌ సైతం ఫిదా అయ్యి రీ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: