టీచర్ అంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వ్యక్తి.  విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె పాటు పడాలి.  అంతేగాని, తన కోసం, తన సుఖం కోసం విద్యార్థులను వాడుకోవాలని చూడకూడదు.  అలా చేస్తే ఆమెను టీచర్ అనరు. మరో పేరుతో పిలుస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కవయ్యారు.  ముఖ్యంగా విదేశాల్లో ఇలాంటి టీచర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  పడక సుఖం కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు.  


అయితే, ఇలాంటివి చాలా రేర్ గా బయటపడుతున్నాయి. రీసెంట్ గా ఇలాంటి వ్యవహారం ఒకరు అట్లాంటాలో బయటపడింది.  అట్లాంటాలోని స్కూల్ లో పనిచేసే టీచర్ తన కామదాహాన్ని తీర్చుకోవడం కోసం కొంతమంది పిల్లలను సెలక్ట్ చేసుకుంది.  వారికి బలవంతంగా మద్యం తాగించి వారితో సెక్స్ చేసేది.  ఒక ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది పిల్లలకు ఇలానే నిత్యం వాడుకుంటూ ఉండేది.  ఈ వ్యవహారం ఇటీవల బయటకు వచ్చింది.  విషయం తెలిసిన తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బంది కూడా షాక్ అయ్యారు.  


వెంటనే సదరు టీచర్ ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయించారు.  ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... బెత్లహేం ప్రాంతంలో నివసించే హెదర్ కిషున్ అనే 35 ఏళ్ల మహిళ జార్జియా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. ఆ సమయంలో స్కూల్ విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లి వారితో పడక సుఖాన్ని ఎంజాయ్ చేసేది. మందు తాగించి మరీ సెక్స్‌ చేయించేది. అలా చాలా మంది విద్యార్థులతో ఆమె అనైతిక సంబంధాలు పెట్టుకుందని బారో కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.  


ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని జార్జియా పాఠశాల యాజమాన్యం అంటోంది. ప్రపంచంలో పురుషులే కామంతో రగిలిపోతున్నారు... రేప్ లు గట్రా చేస్తున్నారని ఇప్పటి వరకు అనుకున్నారు.  కానీ, పురుషులే కాదు, మహిళలు కూడా పురుషులను ఈ విధంగా వినియోగించుకుంటున్నారు.  ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పాలి.  పురుషులు చేస్తే అది తొందరగా బయటకు వస్తుంది.  అదే మహిళలు చేస్తే మాత్రం అంత ఈజీగా బయటకు రావడం లేదు.  వచ్చినా పెద్దగా ఉపయోగం కూడా ఉండదు.  ఎందుకంటే పురుషులనే విమర్శిస్తారు కాబట్టి.  

మరింత సమాచారం తెలుసుకోండి: