మ‌న భార‌త‌దేశంలో పెళ్ళిళ్ళూ.. విడాకులు.. ఇలాంటి సంప్ర‌దాయాల‌కు చాలా విలువ‌లున్నాయి. బంధాలు, బంధుత్వాలంటే ఇక్క‌డ ఒక్క ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఉంటుంది. భార్య‌భ‌ర్త‌ల సంబంధానికి మ‌న‌దేశంలో ఎంతో గొప్ప సంప్ర‌దాయం గౌర‌వం ఉంది. అందుకే మ‌న దేశాన్ని చాలామంది ఈ విష‌యంలో మెచ్చుకుంటారు. మ‌న‌దేశంలోలాగా వేరే దేశాల సంస్కృతి సంప్ర‌దాయాలు ఉండ‌వు. అక్క‌డ సంప్ర‌దాయాలు వేరు. ఒకొక్క‌ళ్ళు మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి, భార్య‌భ‌ర్త‌ల బంధం వీటికి విలువుండ‌దు. ఒకోక్క‌ళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటారు. 

 

ఇటీవ‌లె ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి లాస్ఏంజ‌ల్స్‌లో చోటుచేసుకుంది. ఆమె వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు, ఆయ‌న‌కు 74ఏళ్లు ‘బేవాచ్‌’ అనే  సీరియల్‌ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన పమేలా ఆండర్సన్‌. ఆయన బ్యాట్‌మేన్, ఫ్లాష్‌డాన్స్‌ చిత్రాల ద్వారా ప్రముఖ హాలివుడ్‌ నిర్మాతగా గుర్తింపు పొందిన జాన్‌ పీటర్స్‌. వీరిద్ద‌రు క‌లిసి పెళ్లి చేసుకున్నారు. అయితే అస‌లు విష‌యం ఏమిటంటే... ఇది ఆమెకు ఐదో పెళ్లి అయితే ఆయనకు ఇది ఆరో పెళ్లి. ఇద్దరు కలిసి లాస్‌ ఏంజెలిస్‌లోని మాలిబు పట్టణంలో సోమవారం నాడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రి  పిల్లలు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు . ఈ విష‌యాన్ని ‘ది హాలివుడ్‌ రిపోర్టర్‌’ అనే వెబ్‌సైట్‌ బుధవారం వెల్లడించింది.

 

వారిద్ద‌రికీ ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంది. ‘ప్లేబాయ్‌ మాన్షన్‌’ పమేలా ఆండర్సన్‌ను మొదటి సారి చూసిన వెంట‌నే జాన్‌ పీటర్స్‌ మనసు పారేసుకున్నారట. ఆ స‌మ‌యంలోనే వారిద్ద‌రు క‌లిసి డేటింగ్ కూడా చేశార‌ని స‌మాచారం. వారిద్దరికి పెళ్లవుతోందని హాలివుడ్‌ చెవులు కొరుక్కుంది. అయినా ఎందుకోగాని వారు విడిపోయారు. వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. పమేలా గ‌తంలో పెళ్లి చేసుకున్న నలుగురి మాజీ భర్తలు టామ్మీ లీ, కిడ్‌ రాక్, రిక్‌ సాలోమన్‌లు అంద‌రూ కూడా సెలబ్రిటీలే. తాను మాత్రం 35 ఏళ్లుగా పమేలా కోసం ఎదురు చూస్తూనే ఉన్నానని, ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరిందని జాన్‌ పీటర్స్ చెప్ప‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఆమెలో ఓ నటిగా ఎంతో టాలెంట్‌ ఉందని, ఆ విషయం ఆమెకే తెలియదని ఆయన అన్నారు.

 

ఇక ప‌మేలా ఏకంగా జాన్ పీట‌ర్స్ మీద ఏకంగా క‌వితే చ‌దివి వినిపించింది. పమేలాకు మొదటి భర్త రాక్‌ స్టార్‌ కాగా, మొన్నటి వరకున్న భర్త స్టాకర్‌ స్టార్‌ అడిల్‌ రామి. ఆమెకు ఇద్దరు మగ పిల్లలుండగా, పీటర్స్‌కు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: