నేటి సమాజంలో రోజురోజుకూ లంచగొండితనం పెరిగిపోతుంది.లంచం ఇవ్వందే  కానీ ఏ పనులు కావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో  లంచం ఇవ్వనిది పని కొంచెం అయినా ముందుకు జరగదు. ప్రభుత్వ ఆఫీస్ లలో  పనులు చేయించుకోవడానికి వెళ్తున్న ప్రజలందరూ అధికారులకు లంచాలు ఇవ్వడానికి అలవాటుపడ్డారు... మరోవైపు ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకున్నాకే  ఏ పనైనా చేయడానికి అటు అధికారులు అలవాటుపడ్డారు. ప్రభుత్వ ఆఫీస్ లలో  రోజురోజుకూ లంచాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ఇక  లంచాలు ఇవ్వడానికి మొండి  చేశాము అనుకోండి.. మన ఫైల్ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు .. గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని కాదు... అదే  లంచం ఇస్తే మాత్రం పది రోజులు సమయం పట్టే పని కూడా గంటల్లో అయిపోతుంది. అలా మారిపోయింది నేటి సమాజం తీరు. 

 

 

 ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్ట  చెప్పలేదు అనుకోండి... మనకు సంబంధించిన పనుల్లో అవకతవకలు... దీనికి బదులు లంచం ఇస్తే సరిపోతుంది కదా అని ప్రజలు అనుకునేంతగా ... ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అధికారులు. అందుకే ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు మనం లంచం ఇచ్చేస్తే  సరిపోతుంది కదా అని ప్రజలు... లంచం  వస్తుంది కదా తీసుకుంటే సరిపోతుంది కదా అని అధికారులు ఎవరికి వారు లంచాలతో  సర్దుకుపోతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది... ఓ వ్యక్తి  తన అల్లుళ్ళకి బర్త్ సర్టిఫికెట్ కావాలంటూ  దరఖాస్తు చేసుకున్నాడు .ఆ వ్యక్తిని  బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచం కావాలంటూ డిమాండ్ చేశారు ఆ అధికారి. 

 

 

 కానీ ఆ వ్యక్తి మాత్రం లంచం  ఇవ్వనని  తన పని చేసి పెట్టండి అంటూ తేల్చిచెప్పేశాడు. దీంతో రెండేళ్ల పిల్లాడి వయసును 102 ఏళ్లుగా  మార్చి బర్త్ సర్టిఫికెట్ ను విడుదల చేశారు అదికారులు . దీంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని పవణ్ అనే వ్యక్తి తన ఇద్దరు అల్లుళ్లు శుబ్,  సంకేత్ ల  బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బర్త్  సర్టిఫికెట్ కావాలి అంటే వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు అధికారులు. కానీ ఆ వ్యక్తి మాత్రం లంచం ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. దీంతో శుబ్  తేదీని 2018 నుంచి 1918కి ... సంకేత్ పుట్టిన తేదీని 2016 నుంచి 1916 బర్త్ సర్టిఫికెట్ జారీ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: