ప్రతిరోజు రైల్వేలో  లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది లోకల్ ట్రైన్ లలో రోజు వారి ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది... అప్పుడప్పుడు స్పెషల్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లోకల్ గా ట్రైన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు.. బస్సులలో కంటే  లోకల్ ట్రైన్ లో ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. బస్సుల్లో వెళ్లే చార్జీలతో పోలిస్తే ట్రైన్ లో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ట్రైన్ లో వెళ్తే ఎలాంటి  ట్రాఫిక్ లేకుండా... ఎలాంటి పొల్యూషన్ లేకుండా... హ్యాపీ గా ప్రయాణం సాగించవచ్చు. అందుకే ట్రైన్లలో వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు జనాలు. అయితే ట్రైన్లో వెళ్తే టికెట్ తీసుకోవడం తప్పనిసరి... కానీ చాలా మంది టికెట్ తీసుకోకుండానే ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే టికెట్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేయడానికి ట్రైన్లలో టికెట్ కలెక్టర్లు చాలా తక్కువ మొత్తంలో చెకింగ్  చేస్తూ ఉంటారు. 

 

 

 అందుకే ఎలాగో రైళ్లలో చెకింగ్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది... అలాంటప్పుడు రోజు టికెట్ తీసుకోవడం ఎందుకు అని చాలామందికి తీసుకోకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. టికెట్  లేకుండా ప్రయాణం చేయడం అదో గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది జనాలు. ట్రైన్ లో టికెట్ చెకింగ్ కి అధికారులు వచ్చినప్పటికీ వారినుంచి తప్పించుకొని టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ అధికారులకు దొరికారు అంటే మాత్రం... భారీగా పరిమాణాలు కట్టాల్సిందే. లేకపోతే జైలు శిక్ష కూడా తప్పదు. 

 

 

 అయితే పశ్చిమ రైల్వే విభాగంలో రోజు రోజుకు  టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే అధికారులు కూడా తరచూ టికెట్లు లేని ప్రయాణికులు గుర్తించేందుకు చెకింగ్ లు  చేస్తున్నారు. ఇలా టికెట్లు లేని ప్రయాణికులు నుంచి పశ్చిమ రైల్వే విభాగానికి ఏకంగా వంద కోట్ల ఆదాయం వచ్చింది.  కేవలం 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య.. క్రికెట్ లేని ప్రయాణికుల నుండి ఏకంగా 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా 21.33 లక్షల కేసులు కేసులు కూడా నమోదైనట్లు రైల్వే అధికారులు తెలిపారు.  డిసెంబర్ నెలలోనే 2.13 లక్షల కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  గత సంవత్సరంతో పోలిస్తే 8.85 శాతం వసూళ్లు పెరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: