భారతదేశం అంటే దాయాది దేశం పాకిస్ధాన్ కు ఉన్న ధ్వేషం అందరికీ తెలిసిందే. ఎలాగైనా భారత్ ను దెబ్బతీయాలని తెగ ప్రయత్నించింది. కుదరకపోవటంతో దొంగ దెబ్బకు దిగుతోంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులను, తీవ్ర వాదులను మన దేశంలోకి పంపి అల్లకల్లోలం సృష్టిస్తోంది.  దీనివల్ల భారత్ లో ఎప్పుడూ చికాకులు వస్తునే ఉన్నాయి.

 

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనదేశానికి వ్యతిరేకంగా  పాకిస్ధాన్ అల్ల కల్లోలం రేపాలని తాజాగా నిర్ణయించిందట. ఇందుకోసం భారీగా యువకులను రిక్రూట్ చేసుకుంటోంది. వేలాది మంది యువకులను రిక్రూట్ చేసుకుంటూ వారికి ఉగ్రవాద కార్యకాలాపాల్లో కఠోర శిక్షణ ఇస్తున్నట్లు బయటపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టేందుకు మనదేశం ప్రత్యేకంగా కొన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది లేండి.

 

అటువంటి ఉపగ్రహాల్లో ఒకటి తాజాగా మన మిలిటరీ ఉన్నతాధికారులకు కొన్ని ఫొటోలను, వీడియోలను పంపిందట. అందులో పాకిస్ధాన్ స్ధావరాల్లో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తున్న విషయాలు స్పష్టంగా బయటపడ్డాయట. పాకిస్తాన్ లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తూన్ ప్రాంతాల్లో  దాదాపు 12 కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్న విషయాలు వెలుగు చూశాయి.

 

భారత్ లోకి చొరబడి వివిధ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించటం, టార్గెట్ లను రీచవటం లాంటి అంశాలే టార్గెట్ గా శిక్షణ ఇస్తున్న విషయా సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి.  శిక్షణలో భాగంగా భారత్ లోని కీలక ప్రాంతాలేవి, వాటిని ఏ విధంగా చేరుకోవాలి, టార్గెట్లను ఎలా గుర్తు పట్టాలి అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం వందలాది ఎకరాల్లో ప్రత్యేక సదుపాయాలను కూడా పాకిస్తాన్ ఏర్పాటు చేసింది.

 

ఈ క్యాంపుల్లో నిర్మించిన అత్యాధునిక భవనాల్లో సాంకేతిక అంశాలు అంటే ఇంటర్నెట్ ఉపయోగించుకోవటం, మన పోలీసులకు దొరక్కుండా కోడ్ భాషలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవటం, ప్రార్ధన చేసుకునేందుకు మసీదులు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్ములు, విలాసవంతమైన భవనాలను నిర్మించింది.  ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారిలో 18-35 మధ్య వయస్సున్న యువకులే 92 శాతం ఉన్నారట. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిని పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, రాజస్ధాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్ మీదుగా పాకిస్తాన్ మన దేశంలోకి పంపిస్తోంది. మరి వీరిని ఎలా నియంత్రిస్తుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: