అధికారంలోకి వచ్చాక వైసీపీకి మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని విభజనకు మూడు నెలలు బ్రేక్ పడింది. ఆంధ్ర శాసన మండలిలో రాజధాని విభజన బిల్లు సెలెక్ట్ కమిటికి వెళ్ళింది. అయితే చైర్మన్ తనకు ఉన్న విచక్షణ అధికారంతోనే రాజధాని బిల్లుని.. సీఆర్డీఏ బిల్లుని చైర్మన్ సెలెక్ట్ కమిటికి పంపినట్టు చెప్పారు.                         

 

దీంతో ఏపీ శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మండలిలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని ఇరుపక్షాల సభ్యులు చుట్టుముట్టారు. పోడియాన్ని ఎక్కేందుకు కొడాలినాని యత్నించారు. మండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు.                       

 

దీనిపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమైంది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. 

 

అయితే వైసీపీ వ్యూహం దెబ్బ తినగా చంద్రబాబు వ్యూహం మాత్రం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. కాగా రూల్ 71 నోటీసుపై మంగళవారం అంటే నిన్న రాత్రి ఓటింగ్ నిర్వహించాగా ఇందులో టీడీపీ నోటీసుకు అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు, 9 మంది తటస్థంగా నిలించారు. అయితే నిజానికి మండలిలో టీడీపీ బలం 32 మంది ఉంది సభ్యులైతే 27 మంది మాత్రమే రూల్ 71 నోటీస్‌కు మద్దతుగా ఓటేశారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి నోటీసుకు వ్యతిరేకంగా ఓటేసి టీడీపీకి షాకిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: