’నేను తప్పు చేశాను. రూల్సుకు విరుద్ధంగా నాకున్న విచక్షాణాధికారాలతో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నాను’...

 

స్వామిభక్తి ప్రదర్శించి మొత్తం వ్యవహారాన్ని కంపు చేసిన తర్వాత శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు. స్వామిభక్తి ప్రదర్శించి తప్పు చేసినందుకు చిరవకు పదవిని వదులుకునే పరిస్ధితులు వచ్చాయి. గురువారం నాడు షరీఫ్ తన పదివికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదే బిల్లులు శాసనమండలిలో కూడా ఆమోదం పొందాల్సుంటుంది.

 

అందుకే రెండు బిల్లులు మండలికి వచ్చాయి. మంగళవారం ఉదయం నుండి బిల్లులపై చర్చ జరగకుండా టిడిపి అడ్డుకుంటునే ఉంది. చివరకు బుధవారం కూడా గోల చేస్తునే ఉంది. బిల్లులపై చర్చ జరిగిన తర్వాత గెలుపో ఓటమో తేలిపోవాలి.  బిల్లులపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహించుకోవచ్చని మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా టిడిపి ఒప్పుకోలేదు. వీళ్ళకు మండలి ఛైర్మన్ కూడా బాగానే సహకరించారు.

 

బుధవారం రాత్రివరకూ గోల చేసిన టిడిపి ఒక్కసారిగా బిల్లులను సెలక్ట్ కమిటికి పంపాలని డిమాండ్ మొదలుపెట్టింది. బిల్లులపై చర్చ జరగకుండా సెలక్ట్ కమిటికి పంపేందుకు లేదని మంత్రులు ఎంత పట్టుబట్టినా టిడిపి వినలేదు. ఇదే విధంగా గంటలకొద్దీ గొడవ జరిగిన తర్వాత చివరకు షరీఫ్ తన విచక్షణ ఉపయోగించి రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలంటూ టిడిపి నుండి ఒత్తిడి వచ్చినట్లు మంత్రులంటున్నారు.

 

అసలు షరీఫ్ తన విచక్షణను ఎందుకు ఉపయోగించాల్సొచ్చింది ? ఎందుకంటే చంద్రబాబునాయుడు స్వామిభక్తిని ప్రదర్శించుకునేందుకు. సంవత్సరాల తరబడి షరీఫ్ టిడిపిలోనే పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముస్లింల ఓట్లకోసం షరీఫ్ ను చంద్రబాబు హఠాత్తుగా ఎంఎల్సీని చేసి తర్వాత మండలి ఛైర్మన్ గా నియమించారు. బుధవారం బిల్లులపై గొడవ జరుగుతున్నపుడు చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీల్లో కూర్చుని షరీఫ్ ను ప్రభావితం చేశారని వైసిపి ఆరోపిస్తోంది. చంద్రబాబును చూడగానే షరీఫ్ తన విచక్షణను ఉపయోగించి బిల్లులను సెలక్ట్ కమిటికి పంపేశారు.

 

పైగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించేసిన తర్వాత తాను తప్పు చేశానని స్వయంగా అంగీకరించటం. అంటే చంద్రబాబు కోసమే షరీఫ్ తప్పు చేశారని అర్ధమైపోతోంది. అందుకనే  టిడిపి సభ్యునిగా వైసిపి ప్రభుత్వంలో ఛైర్మన్ గా ఉండలేక చివరకు పదవికి రాజీనామా చేసేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: