తెలుగుదేశం పార్టీకి మండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై చెప్పిన తీరు తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురి చేస్తోంది . రాష్ట్ర విభజన అనంతరం  కాంగ్రెస్ పార్టీ నుంచి , తెలుగుదేశం లో పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు ఆదరించి రాజకీయంగా ప్రోత్సహించారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరుడైన మాణిక్య వరప్రసాద్ కు ప్రత్తిపాడు అసెంబ్లీ టికెట్ కేటాయించారు .

 

అసెంబ్లీ ఎన్నికల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఓటమి పాలయినప్పటికీ , అప్పటికే ఎమ్మెల్సీగా నామినేట్ కావడంతో ఆయన ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు , సీఆర్డీఏ రద్దు వంటి కీలక బిల్లుల నేపధ్యం లో మండలి విప్ గా వ్యవహరిస్తోన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్ని తానై వ్యవహరించాల్సి ఉండగా అస్త్ర సన్యాసం చేయడం పట్ల తెలుగు తమ్ముళ్లు   ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు . అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ నిజాయితీగా పార్టీ నాయకత్వానికి తన వైఖరిని తెలియజేయగా , మరో ఇద్దరు ఎమ్మెల్సీ మాత్రం పార్టీకి నాయకత్వానికి షాక్ ఇచ్చిన తీరు హాట్ టాఫిక్ గా మారింది . మండలిలో రూల్ 71  పై   ఓటింగ్ చేపట్టగా , ఇద్దరు శాసనమండలి సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడం తో  టీడీపీ నాయకత్వం షాక్ కు గురయింది .

 

టీడీపీ సభ్యురాలు పోతుల సునీత , శివనాగిరెడ్డి లు రూల్ 71  వ్యతిరేకంగా ఓటు వేయడం తో వారిద్దరూ పార్టీని వీడడం ఖాయమైనేట్లనని తెలుస్తోంది . పోతుల సునీత ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో వైకాపా లో చేరిననున్నట్లు సమాచారం . ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: