ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలిలో అనుహ్యంగా.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా... బాబొరి వ్యూహం ఫలించింది. తాత్కాలికంగా బాబోరు శాసమండలిలో గెలుపు సాధించడం జరిగింది. అయితే ఈ గెలుపు కారణంగా శాసనమండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

నిన్న ఓటింగ్ లో వారి పార్టీ వారే వారిని వ్యతిరేకించారు.. నిజానికి ఇది అసలైన గెలుపు కాదు.. ఎందుకంటే.. వాస్తవానికి మండలిలో టీడీపీ బలం 32 మంది సభ్యులు. నిన్న రూల్ 71 నోటీసుపై రాత్రి ఓటింగ్ జరగగా.. అందులో టీడీపీ నోటీసుకు అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు, 9 మంది తటస్థంగా నిలించారు. 

 

అయితే వారి పార్టీలోని వారే ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేయగా.. మరో ఇద్దరు గైరుహాజరు అయ్యారు.. ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం ఇది అంత పక్కన పెడితే.. ఇప్పడు బాబోరు గెలిచారు.. ఈ వికేంద్రీకరణ మూడు నెలలు వాయిదా పడింది.. ఇప్పుడు వైసీపీకి ఉన్న మంచి ఆప్షన్ ఏంటి ?

 

బాబోరు కాకుండా.. వైఎస్ జగన్ గెలిచి ఉంటె రాష్ట్ర అభివృద్ధి మరోలా ఉండేది.. మరి ఇప్పుడు అనుకోని రీతిలో.. వైసీపీ వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది.. మరి ఇప్పుడు వైసీపీ ఏ నిర్ణయం తీసుకోనుంది? అసలు వైసీపీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఏం చేయనుంది ?  అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. 

 

అయితే రాజకీయ విశ్లేషకులు అంటున్నట్టు.. ఇప్పుడు ఉభయసభల్నీ ప్రొరోగ్ చేసి, ఆర్డినెన్స్ తీసుకువస్తారా? దానికి సాంకేతిక అవకాశాలు ఉన్నాయా..? దీనికి గవర్నర్ అంగీకరిస్తాడా..? లేదా మండలినే రద్దు చేసే అవకాశం ఉందా? బిల్లుల్లో జాప్యానికి వైసీపీ సిద్ధపడితే.. ఇక ప్రతి కీలక బిల్లుని టీడీపీ ఇలాగె మండలిలో దెబ్బ తిస్తె.. అసలు సీఎం జగన్ ఏ పరిష్కారం ఎంచుకోబోతున్నాడు? ఏ మార్గం ఉంది? ప్రస్తుతం ఇది ఉత్కంఠంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: