శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం శాసనసభలో ఆమోదించిన బిల్లులు శాసనమండలిలో ఉద్దేశపూర్వకంగా సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ షరీఫ్ పంపించడంతో ఎక్కడలేని దుమారం రేగుతోంది. ఈ సందర్భంగా అసలు సెలక్షన్ కమిటీ అంటే ఏమిటి ? దాని విధులు ఏమిటి ? సెలక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ పంపించడాన్ని అందరూ ఎందుకు తప్పు పడుతూ, ఆందోళన చెందుతున్నారు ? దీని వల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ?  టిడిపి ప్రభుత్వానికి కలిగే లాభం ఏంటి ఇలా అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి.

 

సెలెక్ట్ కమిటీ అంటే ...?

ఓ బిల్లు కారణంగా ప్రజలకు నష్టం చేకూరుతుందని భావిస్తే, సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించాలని చైర్మన్ ను కోరుతారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపాదించింది కాబట్టి మండలి నుంచి సెలెక్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. శాసనసభలో స్పీకర్ కమిటీలను వేస్తారు. శాసనమండలిలో అదే విధంగా చైర్మన్ కమిటీలను నియమిస్తారు. శాసనమండలిలో ఏ పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారు తెలుసుకుని వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు సమ ప్రాధాన్యం ఉండేలాగా సభ్యులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం టీడీపీకి శాసనమండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువమంది ఈ కమిటీలో ఉంటారు. 


బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్ళిన తర్వాత ఆ కమిటీ సభ్యులు ఈ బిల్లు వల్ల ప్రభావితమయ్యే వారి వాదనలను సమగ్రంగా వింటారు. అంటే అమరావతి ప్రాంతంలో రైతులతో పాటు విశాఖపట్నం కర్నూలు జిల్లాల ప్రజల కూడా పూర్తి స్థాయిలో మొత్తం 13 జిల్లాల్లోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. అంతేకాకుండా నిపుణులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఆ తర్వాత ఆ బిల్లులో మార్పులు ఉంటే చేస్తారు. మళ్లీ ఆ బిల్లును అసెంబ్లీకి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీ పరిశీలించి, రూపొందించిన బిల్లు పైన అసెంబ్లీలో చర్చ నిర్వహిస్తారు. 


అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి ఆ బిల్లు శాసన మండలికి వస్తుంది. సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలు శాసనసభలో సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మండలి సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించే సూచనలకు శాసనసభ లో మార్పులు ఉండొచ్చు. తర్వాత మళ్లీ మండలికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే సరే.. లేకపోతే బిల్లు ఓడిపోతే రెండోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: