ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం జరిగింది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి తక్కువ బలం ఉండటంతో బిల్లును అడ్డుకోలేక పోయిన శాసనమండలిలో మాత్రం అడ్డుకోవడం జరిగింది. దీంతో శాసనమండలిలో వైసీపీ పార్టీకి బలం లేకపోవడంతో చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్సీల చేత రూల్ 71 తెరపైకి తీసుకువచ్చి మూడు రాజధానులు అదేవిధంగా సిఆర్డిఏ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ కి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు నోటీసులు ఇవ్వడం తో చైర్మన్ తెలుగుదేశం పార్టీ నేత కావడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి శాసనమండలి చైర్మన్ తెలుగుదేశం పార్టీ నేత పంపించడం జరిగింది.

 

దీంతో మూడు రాజధానులు ఏర్పాటు మరింత ఆలస్యం అయింది. సెలెక్ట్ కమిటీ పరిశీలనకు బిల్లు వెళ్లడంతో కనీసం మూడు నెలల సమయం పడుతోంది. దీంతో తాజాగా బిలులు మూడు నెలలపాటు ఆగిపోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను చట్టం చేయలేకపోవడం తో రాజధాని తరలింపునకు బ్రేకులు పడటంతో ఈ సెలెక్ట్ కమిటీ వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చే శాసనమండలిలో బిల్ పాస్ కాకుండా వ్యవహరించడంతో వైయస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికేంద్రీకరణ బిల్ మరింత ఆలస్యం కావడంతో జగన్ మూడు రాజధానిలో ప్లాన్ ఫెయిల్ అయింది.

 

దీంతో వైసిపి పార్టీ మంత్రులు తీవ్ర స్థాయిలో శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లును కూడా శాసనమండలిలో రాజ్యాంగ పదవిలో ఉన్న చైర్మన్ ఆమోదించక పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు బిల్లు పాస్ కాకపోవడంతో వెంటనే రాజధాని రైతుల దగ్గరకు వెళ్ళటం తో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు చంద్రబాబు చేసిన పనికి జై జై లు కొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: