నేడు ఆంధ్రప్రదేశ్ చట్ట సభల్లో అనుకోని రీతిలో చంద్రబాబు వ్యూహం పని చేసింది.. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సెలెక్షన్‌ కమిటీకి పంపారు.. దీంతో శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకొంది .. అటు టీడీపీ వారు హర్షం వ్యక్తం చెయ్యగా వైసీపీ వారు మండిపడ్డారు.. 

 

ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో ఈ రోజు చాలా బాధాకరమైనదని పేర్కొన్నారు. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సెలెక్షన్‌ కమిటీకి పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ తరహాలోనే బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

బాబోరు... చైర్మన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసారని అయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. చైర్మన్‌ టీడీపీకి చెందిన సభ్యుడు కావడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా చేసినట్లు ఉందని అన్నారు. చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేయడం చాలా దుర్మార్గమని బుగ్గన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మంత్రులతో కలిసి మాట్లాడారు.

 

బుగ్గన మాట్లాడుతూ.. ఈ రోజు ఏపీ చట్టసభల్లో చాలా బాధతో కూడిన రోజు..బ్లాక్‌ డే కంటే కూడా ఎక్కువ పదాన్ని వాడాలి. టీడీపీ పార్టీ ఏమాత్రం కూడా చట్టానికి గౌరవం లేకుండా ఆశ్చర్యకరమైన పరిస్థితిలో మండలి చైర్మన్‌కు ఎదురుగా గ్యాలరీలో కూర్చోని చాలా పచ్చిగా ఇన్ఫ్‌ప్లూయన్స్‌ చేస్తూ నిర్ణయం తీసుకునేలా వ్యవహరించారు. 

 

చట్టసభలలో చాల అన్యాయంగా.. దుర్మార్గంగా వ్యవహరించారు.. చట్టసభలు ఇలా చేయడం మొదలు పెడితే చట్టాలు ఎలా చేస్తాం. ఇది చాలా అన్యాయం..దుర్మార్గం. 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో ఓ నిర్ణయం తీసుకుంటే..ఆ నిర్ణయం నచ్చలేదని చెప్పవచ్చు.. కానీ ఇలా కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమైన ఆలోచన. గ్యాలరీలో చంద్రబాబు కూర్చొని చైర్మన్‌గా కూర్చున్న వ్యక్తిని ప్రభావితం చేశారు అని బుగ్గన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: