ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం ఎప్పుడు అమరావతి రాజధాని చుట్టూ తిరుగుతుంది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు తెలుగుదేశం పార్టీ సభ్యులు సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయటంతో ప్రభుత్వం ఆమోదించిన బిల్లును శాసన మండలి చైర్మన్ తెలుగుదేశం పార్టీ సభ్యుడు కావడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయటంతో శాసనమండలిలో వైసీపీ పార్టీ మంత్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో శాసన మండలి రద్దు కు వైయస్ జగన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీలో భారీ మెజారిటీ బలముందని వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలిలో కూడా బిల్లు పాస్ అవుతుందని భావించిన వైయస్ జగన్ శాసనమండలి చైర్మన్ తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడంతో బిల్లు విషయంలో ప్రభుత్వం ఆమోదించిన.... రాజ్యాంగ పదవిలో ఉండి ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించడంతో ఈ విషయం పై వైకాపా మంత్రులు కూడా సరిగా డీల్ చేయకపోవడంతో పార్టీలో ప్రకంపనాలు మొదలయ్యాయి.

 

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి వృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని బలంగా నమ్మిన వైయస్ జగన్ ఈ విషయంలో ఎలా డీల్ చేస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరోపక్క ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంత ప్రజలు వికేంద్రీకరణ కి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

 

ఒకచోట అభివృద్ధి జరగడం వల్ల గతంలో హైదరాబాద్ నగరాన్ని విభజన సమయంలో పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోయాం అటువంటి ఘటన మరొకసారి భవిష్యత్తులో జరగకూడదని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారని అసలు అంతటా అభివృద్ధి జరిగితే తప్పేముందని వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి జరగడం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం ఏమొచ్చిందని రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు చంద్రబాబుపై ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. మరో పక్క వైఎస్ జగన్ మాత్రం కచ్చితంగా వికేంద్రీకరణ బిల్లు పాస్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: