ఏపీలో ఇప్పటి వరకు నడుస్తున్న సాంప్రదాయ రాజకీయాలకు అతీతంగా సరికొత్త రాజకీయం ప్రజలకు చుపించేందుకే జనసేన పార్టీ స్థాపించి, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానని చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లో తాము పోటీ చేయమని, కేవలం ప్రశ్నించడానికి మాత్రమే తాను పార్టీ పెట్టానని ప్రకటించారు . అంత వరకు బాగానే ఉన్నా... ఆ తరువాత తరువాత పవన్ లో అనూహ్యమైన మార్పులు కనిపించాయి.  తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు  అడుగుజాడల్లో నడుస్తూ, ఏపీ ప్రజలు పవన్ పై అనుమానాలు కలిగేలా ఆయన వ్యవహరించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడాన్ని కూడా పవన్ జీర్ణించుకోలేకపోయారు.


 దీంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీకి సహకరించిన బీజేపీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పవన్ ఆ తరువాత పార్టీని ఇకపై ముందుకు నడిపించడం కష్టం అనే భావంతో మెల్లి మెల్లిగా చేతులెత్తేసేందుకు ప్రయత్నిస్తుండగానే  కేంద్ర అధికార పార్టీ బీజేపీ జనసేనను విలీనం చేయాల్సిందిగా కోరారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని విలీనం చేయానని గట్టిగా చెప్పారు పవన్.  కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకుని, బిజెపి అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. నిన్న బిజెపి జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి వెళ్లిన పవన్ ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


బీజేపీతో పొత్తు విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేసే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా  చర్చించుకున్నారు. రాజధాని పై బిజెపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్నాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫిబ్రవరి రెండో తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీలు పాల్గోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: