తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే పచ్చ మీడియా బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసభ్యకరమైన వీడియోలు తీయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మేటర్ లోకి వెళితే చాలా దారుణంగా బరితెగించి మరీ పచ్చ మీడియా చానల్ వారు మహిళా పోలీసులు మరియు కానిస్టేబుళ్లపై అసభ్యకరంగా వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విధులు నిర్వహించడం మహిళా కానిస్టేబులు, పోలీసులు భారీ ఎత్తున రావడంతో వాళ్లకు ప్రభుత్వం మందడం హైస్కూల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి గదుల కేటాయించడం జరిగింది.

 

ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుంటే పచ్చ మీడియా ఛానల్ కి చెందిన వాళ్ళు కనీస మర్యాద లేకుండా వీడియోలు చిత్రీకరించినట్లు సైరా కానిస్టేబుల్ కి పోలీసులకి హై స్కూల్ ప్రాంగణంలో కేటాయించిన గదిలోకి  పచ్చ మీడియా బ్యాచ్ వెళ్లి మరి వాళ్లకు కనబడకుండా దుస్తులు మార్చుకుంటున్న తరుణంలో కిటికీలోనుంచి రహస్యంగా వీడియోలు రికార్డు చేసినట్లు మహిళా కానిస్టేబుల్ ఆరోపించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడానికి మహిళా కానిస్టేబుల్ రెడీ అయ్యారు.

 

దీంతో ఆ పాఠశాలకు చెందిన హెడ్మాస్టర్ కోటేశ్వరరావు జరిగిన ఘటనపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు విధులు నిర్వహించడానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ పట్ల ఈ విధంగా వ్యవహరించటం బాధాకరమని పేర్కొన్నారు. మరోపక్క మహిళా కానిస్టేబుల్ చెప్పండి ఈ ఘాతుకానికి పాల్పడిన పచ్చ మీడియా ఛానల్ ప్రతినిధులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మా బతుకులను కాపాడాలని చిత్రీకరించిన వీడియోలను బయట పెట్టాలని డిలీట్ చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: