మూడు రాజధానుల విషయం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు. శాసనసభలో విజయం సాధించిన వైకాపా పార్టీ శాసనమండలి విషయంలోకి వచ్చే సరికి పూర్తిగా విఫలం అయ్యింది.  శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నది.  ఈ మెజారిటీని దృష్టిలో పెట్టుకొని పనులు చక్కదిద్దాల్సి ఉంటుంది. శాసనమండలిలో వైకాపా విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ అనుకున్నంతగా విజయం సాధించలేదు.  ఇది ఆ పార్టీకి నైతికంగా దెబ్బతగిలినట్టే అవుతుంది.  


అయితే, శాసనమండలిలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.  ఈ విజయంతో చంద్రబాబు నాయుడు తాను అనుకున్న విషయాన్ని అనుకున్నట్టుగా కొంతమేర సక్సెస్ అయ్యాడు.  అంతవరకూ బాగానే ఉన్నది.  అయితే, ఇక్కడ  కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉన్నది.  అదేమంటే, ఇప్పుడు బాబు శాసనమండలిలో బిల్లును అడ్డుకోవడం ఆలనా భవిష్యత్తులో ఆయనకు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని ఇబ్బందులు అచ్చే అవకాశం ఉంటుంది. 


ఉత్తరాంధ్ర నుంచి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే బాబు, ఇప్పటి నుంచే బిల్లును ఎందుకు అడ్డుకున్నామో వాళ్లకు చెప్పాలి.  అలా చెప్పకుంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటె, చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకి కొంతమేర ఇబ్బందులు సృష్టించవచ్చు.  ముఖ్యంగా బాబు తీసుకునే నిర్ణయాల వలన బాబుకు పదేపదే ఉత్తరాంధ్ర నుంచి అసమ్మతి సెగ తగులుతుంది.  


బాబు శాసనమండలిలో విశాఖకు వ్యతిరేకంగా చేసిన పోరాటం  వలన విశాఖ పట్నానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇప్పటికే ఆ ప్రాంతం అన్నిరకాలుగా అభివృద్ధి చెంది ఉన్నది.  అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం వలన అక్కడి ప్రజల జీవనం హ్యాపీగానే ఉంటుంది.  అయితే, విశాఖలో రాజధాని అని ఇప్పటి వరకు ప్రచారం ఉన్నది, దానిని బాబు అడ్డుకున్నాడు కాబట్టి విశాఖకు మంచి చెడు అనే విషయాలు పక్కనపెడితే, బాబుకు మాత్రం భవిష్యత్తులో ఉత్తరాంధ్ర నుంచి ఇబ్బందులు వస్తాయి అన్నది మాత్రం గ్యారెంటీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: