ఇండియా... పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య ఎంతకాలంగానో పరిష్కారం కాకుండా ఉన్నది.  రెండు దేశాలు ఈ విషయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ కూడా కొంత వరకు పరిష్కారం అయినా, ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  దీనికి అనేక కారణాలు ఉన్నాయి.  అందులో ఒకటి పాక్ పదేపదే ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఇండియాలోకి పంపించి ఇక్కడ అలజడులు సృష్టించడం.  రెండోది ఇండియపై పదేపదే పాక్ అనుచిత వ్యాఖ్యలు చేయడం.  ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ఇండియాపై అంతర్జాతీయంగా ఎంతగానో బురదజల్లాలని చూసింది.  


ప్రతిసారి ఇండియా వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతూనే ఉన్నది.  కానీ, పాక్ కు మాత్రం బుద్దిరావడం లేదు.  అమెరికాను అడ్డం పెట్టుకొని కాశ్మీర్ విషయంలో పరిష్కరించుకోవాలని చూస్తున్నది.  కానీ, కాశ్మీర్ విషయం ద్వైపాక్షిక అంశం అని మూడో దేశం ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలులేదని ఇప్పటికే స్పష్టం చేసింది.  ఇంతగా చెప్పినప్పటికీ అమెరికా ప్రతిసారి మాట తప్పుతూనే ఉన్నది.  


దావోస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరలా నోరుజారి మాట్లాడారు.  కోరుకుంటే రెండు దేశాల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మధ్యవర్తిత్వం చేస్తామని అన్నారు.  కానీ, దానికి ఇండియా ఒప్పుకోవడం లేదు.  రెండు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ సమస్యను రెండు దేశాలే పరిష్కారం చూసుకుంటాయని, మూడో దేశం జ్యోక్యం అవసరం లేదని, ముమ్మాటికీ అవసరం లేదని అంటున్నారు.  రెండు దేశాలు తమ సమస్యను ఎప్పటికైనా సరే సాధించుకొని తీరుతాయని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. 


మరోసారి ఈ విషయంలో అమెరికా తలపెట్టవద్దని వార్నింగ్ ఇచ్చింది.  అది రెండు రెండుదేశాలకు మంచిది కాదని స్పష్టం చేసింది.  ట్రంప్, ప్రధాని మోడీలు గతేడాది అమెరికాలో కలుసుకున్న సమయంలోనే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.  మరలా ఇప్పుడు ఈ విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.  ఇండియా పాక్ మధ్య ఉన్న కాశ్మీర్ సమస్య రెండు దేశాలే పరిష్కారించుకుంటాయి.  అయితే, మొదట పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయాలి.  అప్పుడే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  అప్పటి వరకు ఇది తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: