తనకున్న విచక్షణ అధికారాలతో అభివృద్ధి వికేంద్రీకరణ, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపుతున్నా..ఇది శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానులకి సంబంధించిన బిల్లులపై తీసుకున్న నిర్ణయం. అయితే ఈ దీని వల్ల రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయానికి ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా? ఆంధ్రా ప్రజలు కోరుకున్న విధంగా మూడు రాజధానులు ఏర్పాటు అసాధ్యం కానుందా? అంటే అసలు కానే కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

 

ఎందుకంటే మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం...బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళతాయి. ఆ కమిటీని కూడా ఛైర్మన్‌నే ఎంపిక చేస్తారు. అందులో మెజారిటీ ఉన్న టీడీపీ సభ్యులే ఎక్కువ ఉంటారు. ఇక ఈ కమిటీ రాష్ట్రమంతా తిరిగి ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకుని...బిల్లులో ఏమన్నా మార్పులు చేయాలనుకుంటే చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపుతారు. ఇక అక్కడ మళ్ళీ బిల్లుపై సవరణలు చేసి ఆమోదించి మండలికి పంపుతారు. ఒకవేళ మండలిలో తిరస్కరణకు గురైన చివరికి అసెంబ్లీలో ఆమోద ముద్రవేసుకుని ముందుకు వెళతారు.  అయితే ఈ ప్రక్రియ అంతా ముగిసే సరికి ఎక్కువ సమయమే పట్టే అవకాశముంది.

 

కానీ ఈ తతంగం లేకుండా మండలిలో టీడీపీ అండ్ కొ చేసిన పనులకు కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం వెంటనే ఇంకో సరికొత్త నిర్ణయం తెరపైకి తీసుకు రావోచ్చు. ఓ రకంగా జగన్ ఇలా జరగాలనే ఓ వ్యూహంతో ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని బాబు అండ్ కొ కూడా అలాగే చేసింది. అసలు దీని బట్టి చూస్తే జగన్ నెక్స్ట్ స్టెప్ ఇలాగే ఉండనుందని తెలుస్తోంది.

 

ఇప్పుడు బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపారు కాబట్టి...దాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టేసి ఒక్కసారిగా శాసనసభ, శాసనమండలిలకు సంబంధించిన ఉభయ సభా సమావేశం ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఇక ఎలాగో వైసీపీకి భారీ మెజారిటీ ఉంది కాబట్టి...బిల్లులకు ఆమోదముద్ర వేసి అమలు చేయనుంది. ఇక ఈ దెబ్బకు టీడీపీ రాష్ట్రమంతా కనుమరుగైపోయి...కేవలం అమరావతిలోనే ఐదారు ఊళ్ళకు పరిమితం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: