చంద్రబాబు నాయుడుకు మండలిలో కొంత విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మండలిలో విజయం సాధించిన తరువాత ఇప్పుడు అయన కొంత ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు.  ఆ ఇబ్బందులు ఏంటి అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం.  ప్రభుత్వ బిల్లులను మండలిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.  కానీ, మండలి చైర్మన్ అందుకు విరుద్ధంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు తీసుకున్నారు.  


మండలిలో బిల్లు గురించి చర్చించకుండా, రూల్ నెంబర్ 71 వ చర్చ జరిపారు.  అనంతరం ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ చెప్పడంతో వైకాపా మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.  మంత్రులు చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లడంతో చైర్మన్ షరీఫ్ అక్కడి నుంచి తన చాంబర్ కు వెళ్ళిపోయాడు.  అనంతరం అయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ... సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు.  


దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఇప్పటి వరకు ఎక్కడా కూడా సెలక్ట్ కమిటీకి పంపిన దాఖలాలు లేవు.  కానీ, ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పుడు సెలక్ట్ కమిటీ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సెలక్ట్ కమిటీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటె, మండలి చైర్మన్ మండలిని నిరవధికంగా వాయిదావేసి వెళ్లిన తరువాత ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  


మంత్రులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో చైర్మన్ షరీఫ్ బాధపడినట్టు సమాచారం.  అయన మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే దాని వలన ఎవరికీ వైకాపాకు లాభం ఉంటుందా లేదా అన్నది చూడాలి.  ఒకవేళ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం వలన తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టాలు ఏంటి అన్నది ఆలోచించాల్సిన అంశం.  

మరింత సమాచారం తెలుసుకోండి: