నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని అంశం చుట్టూ అధికార విపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధం అందరికీ తెలిసిందే. టీడీపీ హయాంలో మూడు పంటలు పండే భూములను తీసుకుని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని పేరు పెట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అధికారం వైసీపీకి వచ్చాక రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. అప్పటి నుంచీ.. దాదాపు 36 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు అలుపు లేకుండా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

 

 

రైతులు చేస్తున్న ధర్నాలకు టీడీపీ సహజంగానే రాజకీయ పాత్ర పోషిస్తోంది. నిత్యం ఆ పార్టీ నాయకులు.. అధినేత చంద్రబాబుతో సహా వెళ్లి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు టీడీపీ నాయకులే రాజీనామా చేసి గెలవచ్చు కదా అనేది అసలు ప్రశ్న. రైతులకు ఎన్నో చెప్పి భూములు తీసుకున్న టీడీపీ ఇప్పుడు ఆమాత్రం వాళ్ల తరపున లేకపోతే తమకు ఇబ్బంది అని గ్రహించే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఆ ప్రాంతంలో గెలవలేదు.. ఇప్పుడు పార్టీ నుంచి నాయకులు ఒకొక్కరుగా జారుకుంటున్నారు.

 

 

ఈనేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులకు మద్ధతిస్తున్న టీడీపీకి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల నుంచి మద్దతు ఉంటుందా అనేది ప్రశ్న. అధికార వికేంద్రీకరణ చేయడానికి ఒప్పుకోని టీడీపీపై వ్యతిరేకత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టు టీడీపీ సభ్యులు రాజీనామా చేస్తారా.. అంటే అంత ధైర్యం చేయరనే రాజకీయ పక్షాలు అంటున్నాయి. భూములు తీసుకున్నారు కాబట్టి.. తమ బాధ్యతగానే టీడీపీ ఆ ప్రాంతవాసుల పక్షాన నిలబడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: