2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ సర్కార్ పై  పైచేయి సాధించడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ జగన్ సర్కారు మాత్రం చంద్రబాబుకు భారీ షాక్ లు  ఇస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి శ్వాసగా బతికిన చంద్రబాబుకు 3 రాజధానిలు  అంటూ  జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ 3 రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి... మూడు రాజధానిలను  అడ్డుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది టిడిపి పార్టీ. దీని కోసం రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడం.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం లాంటివి చేసింది. ఇక ఎట్టకేలకు టీడీపీకి అవకాశం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టగా టిడిపి ఎమ్మెల్సీ లందరూ బిల్లు చర్చకు రాకుండా మొదటిరోజు అడ్డుకున్నారు. 

 

 

 రెండో రోజు కూడా మంత్రుల ఒత్తిడి తో బిల్లు శాసన మండలిలో చర్చకు వచ్చింది. శాసన మండలిలో బిల్లుపై చర్చ జరిగేటప్పుడు కూడా మొత్తం రసాభాస గానే సాగింది. చర్చ ముగిసిన అనంతరం వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కానీ అధికార పార్టీ మాత్రం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ నిర్ణయం కీలకంగా మారిన నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ కూడా వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించారు. దీంతో శాసన మండలిలో టీడీపీకి  ఎక్కువ మెజారిటీ ఉండటంతో అధికార పక్షంపై టిడిపి విజయం సాధించినట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే చంద్రబాబు శాసనమండలిలో గెలిస్తే ఎవరికి లాభం.. కేవలం అమరావతిలోని 29 గ్రామాలకు మాత్రమేనా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి  సర్కార్ కర్నూలులో న్యాయపరమైన రాజధాని విశాఖలో పరిపాలన రాజధాని అమరావతి లో  చట్టసభలు రాజధాని ఏర్పాటు చేస్తాం అంటే...అటు  కర్నూలు ప్రజలు ఇటు విశాఖ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ కు మద్దతు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు సైతం జగన్ సర్కార్ కు మద్దతు ప్రకటించారు. కేవలం ఒక అమరావతి రైతులు మాత్రమే జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శాసనమండలిలో గెలుపు... 13 జిల్లాలకు నష్టం చేస్తూ.. అమరావతిలోని 29 గ్రామాలకు మాత్రమే లాభం చేస్తుంది అంటూ పలువురు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: