నిన్న శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలు పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా మండలి చైర్మన్ షరీఫ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారు. శాసన సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు శాసనమండలిలో ఆమోదం పొందేందుకు మండలికి రాగానే ఆ బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపిస్తూ ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మండలి చైర్మన్ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇచ్చిన రూల్స్ 71 ఏ రాష్ట్రంలో లేదని, టీడీపీ అధినేత చంద్రబాబు మండలి గ్యాలరీ లో కూర్చుని మరీ చైర్మన్ ను ప్రభావితం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

 

వాస్తవంగా అయితే సేసనమండలికి వచ్చిన బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించాలని సభ్యుల నుంచి ప్రతిపాదన వస్తే దాన్ని పరిశీలించి దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన మండలి ఛైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అటు బీజేపీ ఎంఎల్సీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో తెలుగుదేశం పార్టీ పైన, మండలి ఛైర్మన్ పైనా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే మండలి చైర్మన్ టీడీపీకి అనుకూలంగా నిర్ణయం  తీసుకున్నారని తేలిపోవడంతో వ్యక్తిగతంగానూ షరీఫ్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చైర్మన్ చర్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తమ నోటికి పని చెబుతుండడంతో మనస్తాపానికి గురైన షరీఫ్ శాసనమండలి చైర్మన్ రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

 ఇదే విషయమై ఆయన టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేయగా  తొందరపడవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటూ ఆయన్ను బుజ్జగించినట్టు సమాచారం. కానీ ఆయన మాత్రం మండలి చైర్మన్ కు రాజీనామా చేయడంతోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట. లేకపోతే తాను చేసిన తప్పు జీవితాంతం మోయాల్సి వస్తుందని, తాను ఇప్పుడు వరకు సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు ఒక్కసారిగా పోతాయని,  ఈ మాయని మచ్చ మోసేకంటే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటే కాస్త గౌరవమైన దక్కుతుందని షరీఫ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈరోజు రాజీనామాపై ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: