ఉద్యోగాల కోసం ఫైలు చేత పట్టుకుని తిరిగే వారు ఎంతోమంది. అయితే ఏదైనా కంపెనీలో ఉద్యోగం ప్రయత్నించినప్పుడు ఉద్యోగం రాకపోతే ఏం చేస్తాం... ఏదో మన బాడ్ లక్ వేరే దాంట్లో ట్రై చేసుకుందాం లే అంటూ నిరాశతో వెనుతిరుగుతాం. ఇలా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి ఉద్యోగాలు దొరకని వారు ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి మంచి ఉద్యోగం దొరక్క పోతుందా అనే ఆశతో ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటారు.కానీ ఉద్యోగం ఇవ్వని వారిపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తారా  .. కానీ ఇక్కడ ఓ వ్యక్తి అలాంటి పని చేశాడు. ఉద్యోగం ఇవ్వలేదని పోలీసుల పై కక్ష తీర్చుకునే ప్రయత్నించాడు. 

 

 

 అదేదో మామూలుగా కాదండోయ్ ఏకంగా విమానాశ్రయంలో బాంబు పెట్టి నట్లు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇక నిందితుడు తీరుతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... తనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడం వల్లే మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో... బాబు పెట్టినట్లు నిందితుడు ఆదిత్య రావు వెల్లడించాడు. ఇక ఉదయం అతడు  డిజిపి కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. ఈ సందర్భంగా నిందితుడు చెప్పిన మాటలు పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తను ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేశానని తెలిపారు నిందితుడు ఆదిత్యరావు . 

 

 

 తన స్వస్థలం మణిపాల్ అని తెలిపిన నిందితుడు... ఓ ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగం కోసం 2012 సంవత్సరంలో బెంగళూరు వచ్చాను అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి మంగళూరు వచ్చానని పోలీసులతో తెలిపాడు నిందితుడు ఆదిత్య రావు. అయితే 2018 సంవత్సరంలో బెంగుళూరు విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు నిందితుడు ఆదిత్య... కేసులో పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత తనకు శిక్ష విధించిన పోలీస్ పై కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు... దీంతో ఈ సారి బెంగుళూర్ లో కాకుండా  మంగళూరు విమానాశ్రయంలో భామ పెట్టినట్లు  నిందితుడు పేర్కొన్నాడు. అంనంతరం  డిజిపి కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: