ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని కోసం జీవితంలో ఎప్పుడూ లేనిది జోలె కూడా పడుతున్నారు. జై అమరావతి అని నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ఇంత హంగామా చేస్తున్న చంద్రబాబు ఒక్క విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అదేంటంటే.. ప్రాంతీయ అభివృద్ధిపై బాబు వ్యూహం ఏంటి?

మూడు రాజ‌ధానులు వ‌ద్దంటున్న చంద్రబాబుకు ప్రాంతీయ స్థాయిలో ప్రశ్నలు వ‌స్తున్నాయి. ఇలా అయితే, ఏ వ్యూహం ప్రకారం ప్రాంతీయ అభివృద్ధి చేయాలో చెప్పాలనే గ‌ళాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులు వద్దు.. మరి అభివృద్ధి ఎలా అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివద్ధి చెందేది ఎలా.. దీనికి చంద్రబాబు వద్ద ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా.. అంటే అబ్బే అలాంటిదేమో కనిపించదు. కానీ.. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని.. అదే అమరావతి ఉండాలి. ఇదీ చంద్రబాబు కృతనిశ్చయం అన్నమాట.

 

పోనీ.. అదే మాట నిజమనుకుందాం.. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.. అన్నీ ఆ రాజధానిలోనే ఉండాలి. ఇదే తెలుగుదేశం పాలసీ అనుకుందాం. మరి అదే విషయం చంద్రబాబు ఏ వైజాగ్ వెళ్లో చెప్పొచ్చు కదా. వైజాగ్ లోనే ఓ సభ పెట్టి ఒకే రాజధాని ఆవశ్యకతను ప్రజలకు వివరించి వారి కళ్లు తెరిపించొచ్చు కదా. అబ్బే అలాంటి ప్రయత్నం చేయరు.

 

అలా కాదు.. పోనీ.. మరి కర్నూలు వెళ్లయినా.. అక్కడి జనంతో అబ్బే మన కర్నూలుకు హైకోర్టు వద్దండీ.. ఇది ఆ రాజధాని ప్రాతంలోనే ఉంటే బావుంటుంది. అని అనగలడా.. ఒక వేళ చంద్రబాబు అలా అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏంటి.. ఈ ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు టీమ్ వద్ద సమాధానాలు దొరకవు. ఈ లెక్కలో చూస్తే చంద్రబాబు మూడు రాజధానులు వద్దంటే రాజకీయంగా ఆయనకు మూడినట్టే..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: